Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
చదువుకోకుండా ఇంటి వద్దనే ఉన్న కుమార్తెను చదువుకోమని తల్లి మందలించడమే తప్పయింది. మనస్థాపంతో ఆ బాలిక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
చదువుకోకుండా ఇంటి వద్దనే ఉన్న కుమార్తెను చదువుకోమని తల్లి మందలించడమే తప్పయింది. మనస్థాపంతో ఆ బాలిక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపిన తల్లి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. బాలానగర్ పీఎస్ పరిధి పద్మానగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల కవల పిల్లలను తల్లి సాయిలక్ష్మి గొంతు నులిమి చంపింది. అనంతరం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ పరిదిలో ఘోరం చోటుచేసుకుంది. ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఈ దుశ్చర్యను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్త్రత తనిఖీలు నిర్వహిస్తున్నారు. రోజువారి తనిఖీల్లో భాగంగా అమీర్‌పేట మైత్రివనం దగ్గర చేసిన తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.25 లక్షల నగదును స్టాటిక్ సర్వేలియన్స్ టీమ్ స్వాధీనం చేసుకుంది.
ఓ యువతి తండ్రి మీద ప్రేమతో ఏకంగా ప్రాణాలే తీసుకుంది. తండ్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ప్రాణంగా భావించే తండ్రి చనిపోవటంతో ఆమె తట్టుకోలేకపోయింది. తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని డయాలసిస్ కేంద్రానికి రక్త శుద్ధి కోసం వెళ్లిన 60 ఏళ్ల వృద్ధుడికి గత నెలలో రక్త పరీక్షల్లో హెచ్ఐవీ (HIV) నిర్ధారణ కావడం కలకలం సృష్టించింది. బాధితుడు ప్రస్తుతం కోమాలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బైక్‌తో ట్రాక్ దాటుతున్న ఓ యువకుడు ట్రాక్ పై జారిపడడంతో..రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందడం అందరిని కలిచివేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది.
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో దారుణం జరిగింది. చదువుతో పాటుగా మంచి చెడులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థినిని లైంగికంగా వేధించాడు.
జనగామ ఉప-జైలులో సింగరాజుపల్లికి చెందిన ఖైదీ మల్లయ్య బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతడిని వరంగల్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ఆసుపత్రి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మరణించాడు.