UK: యూకేలో భారతీయ యువతిపై అత్యాచారం..జాతి వివక్షతో దాడి

యునైటెడ్ కింగ్‌డమ్ (UK) లోని వెస్ట్ మిడ్‌ల్యాండ్స్‌లో దారుణం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన 20 ఏళ్ల యువతిపై అత్యాచారం జరిగింది. ఉత్తర ఇంగ్లండ్‌లోని వాల్‌సాల్ ప్రాంతంలో శ్వేతజాతీయుడైన ఓ వ్యక్తి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

New Update
sexual assault

sexual assault in uk

UK: యునైటెడ్ కింగ్‌డమ్ (united-kingdom) లోని వెస్ట్ మిడ్‌ల్యాండ్స్‌లో దారుణం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన 20 ఏళ్ల యువతిపై లైంగిక దాడి జరిగింది. ఉత్తర ఇంగ్లండ్‌(england)లోని వాల్‌సాల్ ప్రాంతంలో శ్వేతజాతీయుడైన ఓ వ్యక్తి యువతిపై అత్యాచారానికి(Racial Discrimination Attack) పాల్పడ్డాడు. దీన్ని 'జాతి వివక్ష దాడి'గా పరిగణిస్తున్న వెస్ట్ మిడ్‌లాండ్స్ పోలీసులు, నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు అనుమానితుడి సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేశారు.

ఒక మహిళపై లైంగిక దాడి జరగడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై వీధి మధ్యలో కూర్చున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వెంటనే వాల్సాల్‌లోని పార్క్ హాల్ ప్రాంతానికి పోలీసులు వెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ పోలీసులు నేరస్థుడిని పట్టుకునే ప్రయత్నంలో అతని చిత్రాన్ని విడుదల చేశారు. నిందితుడిని కనుగొనడంలో అధికారులకు సహకరించాలని స్థానికులకు కూడా వారు విజ్ఞప్తి చేశారు.

Also Read :  ప్యారిస్ మ్యూజియం చోరీ.. నెపోలియన్ ఆభరణాలు దొంగలించిన ఇద్దరు అరెస్ట్

Indian Woman Raped In UK

పోలీసుల కథనం ప్రకారం, శనివారం సాయంత్రం వాల్‌సాల్‌లోని పార్క్ హాల్ ప్రాంతంలో ఓ యువతి పై లైంగిక దాడి(sexual-assault) జరగడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై వీధి మధ్యలో కూర్చున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.  వెంటనే స్పందించిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై డిటెక్టివ్ సూపరింటెండెంట్ రోనన్ టైరర్ మాట్లాడుతూ, "ఇది అత్యంత దారుణమైన దాడి. నిందితుడిని అరెస్ట్ చేయడానికి సాధ్యమైన ప్రయత్నం చేస్తున్నాం. సాక్ష్యాలను సేకరించేందుకు, నిందితుడిని గుర్తించేందుకు మా బృందాలు పనిచేస్తున్నాయి" అని తెలిపారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే తెలియజేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా ఆ ప్రాంతం నుంచి వెళ్లిన వాహనాల డాష్‌క్యామ్ ఫుటేజ్ లేదా సీసీటీవీ ఫుటేజ్ ఉంటే దర్యాప్తులో కీలకం కాగలదని వివరించారు.

దాడి చేసిన వ్యక్తి 30 ఏళ్ల వయసున్న శ్వేతజాతీయుడని, పొట్టి జుట్టుతో, నలుపు రంగు దుస్తులు ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు.పోలీసులు బాధితురాలి వివరాలను అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఆమె పంజాబ్‌కు చెందిన యువతి అని స్థానిక కమ్యూనిటీ గ్రూపులు పేర్కొంటున్నాయి. సమీపంలోని ఓల్డ్‌బరీ ప్రాంతంలో నెల రోజుల క్రితం సిక్కు మహిళపై ఇలాంటి జాతి వివక్ష అత్యాచార ఘటనే జరగడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సిక్ ఫెడరేషన్ యూకే అనే సంస్థ స్పందిస్తూ, నిందితుడు ఆమె నివసిస్తున్న ఇంటి తలుపులు పగలగొట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిపింది. రెండు నెలల వ్యవధిలో ఇది రెండో ఘటన అని, నిందితులను త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేసింది. వాల్‌సాల్ పోలీస్ చీఫ్ సూపరింటెండెంట్ ఫిల్ డోల్బీ మాట్లాడుతూ, ఈ దాడి వల్ల సమాజంలో నెలకొన్న భయాందోళనలను తాము అర్థం చేసుకోగలమని అన్నారు. ప్రజలతో మాట్లాడి వారి ఆందోళనలను వింటున్నామని, రాబోయే రోజుల్లో ఆ ప్రాంతంలో పోలీసుల పహారా పెంచుతామని హామీ ఇచ్చారు.

Also Read:  తెలంగాణలో విషాదం. కుక్క కాటు గురించి దాచిపెట్టిన బాలిక.. నెల రోజుల తర్వాత రేబిస్‌తో మృతి

Advertisment
తాజా కథనాలు