/rtv/media/media_files/2025/03/02/9Fne2PLZ5z0RsaXyYMcv.jpg)
A student died after being hit by a parked tractor.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో విషాదం(Huzurabad accident) చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం హుజురాబాద్ పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదం(road accident) లో ఓ డిగ్రీ విద్యార్థి(degree-student) మృతి చెందాడు. హుజురాబాద్ నుంచి జమ్మికుంట వెళ్లే మార్గంలో డివైడర్లలో మట్టి పోయడానికి రోడ్డు పై నిలిపి ఉంచిన మున్సిపల్ ట్రాక్టర్‌ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.​ పోలీసుల కథనం మేరకు​హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ కాలనీకి చెందిన వేములవాడ అక్షయ్ సాయి (18) కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. తన స్నేహితుడిని తీసుకురావడానికి బైక్ పై హుజురాబాద్ నుంచి రంగాపూర్ గ్రామానికి వెళ్తున్నాడు.ఈ క్రమంలో హుజురాబాద్ పట్టణంలోని గెలాక్సీ సూపర్ మార్కెట్ ముందు మున్సిపల్ ట్రాక్టర్ నిలిపి ఉంది. సిబ్బంది డివైడర్లలో మట్టి పోస్తున్నారు. వేగంగా బైక్‌పై వస్తున్న అక్షయ్ సాయి అక్కడ నిలిపి ఉన్న ట్రాక్టర్‌ను గమనించకుండా దానిని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టాడు.
Also Read : రేవంత్ సర్కార్‌కు షాక్.. ప్రైవేట్ కాలేజీల వార్నింగ్
A Student Died After Being Hit By A Parked Tractor
ఈ ప్రమాదంలో అక్షయ్ సాయికి తలకు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు హుటాహుటిన అక్షయ్ సాయిని పక్కనే ఉన్న హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అక్షయ్ సాయి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా ఉదయం పూట డివైడర్లలో మట్టి పోయడానికి మున్సిపల్ సిబ్బంది ట్రాక్టర్ ను నిర్లక్షంగా రోడ్డుపై నిలిపినట్లు తెలుస్తోంది. అయితే ఉదయం మంచు నిండి ఉండి చీకటిగా ఉండటంతో సమీపానికి వచ్చేవరకు ట్రాక్టర్ కనపడలేదని, కనీసం అక్కడ ట్రాక్టర్ నిలిపినట్లు సిబ్బంది ఎలాంటి నిరోధకాలు పెట్టలేదని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి మృతితో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. కాగా రోడ్డు ప్రమాదం పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్‌ను రోడ్డు పై నిలిపేటప్పుడు సరైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: చంపేసింది బాబోయ్.. 10,000mAh బ్యాటరీతో కొత్త మోడల్ సూపరెహే..!
Follow Us