Fire Accident: మరో భారీ అగ్నిప్రమాదం.. రెస్టారెంట్‌లో 4 గ్యాస్ సిలిండర్‌లు బ్లాస్ట్ - ఒకరు స్పాట్ డెడ్

యూపీలోని మొరాదాబాద్‌ కట్‌ఘర్ ప్రాంతంలోని ఒక రెస్టారెంట్‌, దాని పైభాగంలో ఉన్న ఇంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. దీంతో మంటలు ఉవ్వెత్తును ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది.

New Update
restaurant fire cylinder blast

uttar pradesh moradabad restaurant fire

మొరాదాబాద్‌లోని కట్‌ఘర్ ప్రాంతంలోని ఒక రెస్టారెంట్‌, దాని పైభాగంలో ఉన్న ఇంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి(gas-cylinder-blast). దీంతో మంటలు ఉవ్వెత్తును ఎగసిపడ్డాయి. దీంతో స్థానికులు గుర్తించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఫైర్ సిబ్బంది ఏడు అగ్నిమాపక యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకుంది. అనంతరం తీవ్రంగా శ్రమించిన తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. అయితే ఈ సంఘటన జరిగిన సమయంలో రెస్టారెంట్‌లో 15 నుంచి 16 మంది ఉన్నారని.. అందులో ఒక మహిళ చనిపోయినట్లు తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Moradabad Fire Accident

ఉత్తరప్రదేశ్‌ మొరాదాబాద్‌లోని ఒక రెస్టారెంట్‌లో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న రెస్టారెంట్‌లో భారీగా మంటలు చెలరేగాయి. అవి కాస్త పెరిగి పైనున్న అంతస్తులకు వ్యాపించింది. దీంతో పై అంతస్తులో ఉన్నవారు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఇక మంటలు చెలరేగిన తర్వాత రెస్టారెంట్‌లో నాలుగు గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో మంటలు మరింత చెలరేగాయని సమాచారం. ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించగా, అనేక మంది గాయపడ్డారు. 

ఈ ఘటనపై మొరాదాబాద్ జిల్లా హాస్పిటల్ అత్యవసర వైద్య అధికారి డాక్టర్ జునైద్ అసరి మాట్లాడుతూ.. ‘‘మొత్తం ఏడుగురు పేషెంట్లను ఇక్కడికి తీసుకువచ్చారు. వారిలో 56 ఏళ్ల మాయ అనే మహిళ చనిపోయింది. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉంది.’’ అని తెలిపారు. 

Also Read :  బీహార్ ఎన్నికల ముందు JDUలో కలకలం.. 2 రోజుల్లోనే 16 మంది సస్పెండ్

ఈ ప్రమాదంపై మొరాదాబాద్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ పాండే మాట్లాడుతూ.. ‘‘క్లార్క్స్ ఇన్ హోటల్ ఎదురుగా ఉన్న రెస్టారెంట్‌లో మంటలు చెలరేగాయని రాత్రి 10 గంటల ప్రాంతంలో మాకు కాల్ వచ్చింది. మొదట్లో రెండు అగ్నిమాపక వాహనాలను పంపాం. కానీ నాలుగు సిలిండర్లు పేలడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో ఏడు అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి వచ్చాయి. కొంతమంది పై అంతస్తులో చిక్కుకున్నారు. నలుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు సహా 16 మందిని మేము రక్షించాము. మంటలకు కారణం ఇంకా తెలియదు.’’ అని తెలిపారు.

మొరాదాబాద్ ఎస్పీ సిటీ కుమార్ రణ్‌విజయ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఈ సంఘటన కట్‌ఘర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగింది. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో రెస్టారెంట్‌లో దాదాపు 15-16 మంది ఉన్నారు. అందరినీ సురక్షితంగా తరలించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు రాలేదు, కానీ తరువాత ఒక వ్యక్తి మరణించినట్లు నిర్ధారించారు’’ అని అన్నారు.

Advertisment
తాజా కథనాలు