Bride Dies: తెల్లారితే పెళ్లి.. అంతలోనే... నృత్యం చేస్తూ వధువు మృతి

వివాహానికి ఒక రోజు ముందు పెళ్లి కూతురు గుండెపోటుతో మృతి చెందింది. భాంగ్రా నృత్యం చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నపెళ్లికూతురు ఒక్కసారిగా కుప్పకూలింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లగా గుండెపోటుతో ఆమె మరణించినట్లు వైద్యుడు ధ్రువీకరించారు.

New Update
Early morning wedding.. Bride dies of heart attack

Early morning wedding.. Bride dies of heart attack

మారుతున్న కాలంతో పాటే వ్యాధులు మారుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు(heart attack incident)లు చోటు చేసుకుంటున్నాయి. చిన్న వయసులోనే గుండె పోటుతో మరణిస్తున్నారు. అప్పటివరకు ఆరోగ్యంగా ఆడుతూ, పాడుతూ అకస్మాత్తుగా కుప్పకూలుతున్నారు. అలాంటి ఘటనే పంజాబ్‌లో చోటు చేసుకుంది. వివాహానికి ఒక రోజు ముందు పెళ్లి కూతురు(bride) గుండెపోటుతో మృతి చెందటంతో విషాదం మిగిలింది.

Bride Dies While Dancing

పంజాబ్‌(punjab) లోని ఫరీద్‌కోట్‌లో జరిగిన ఈ విషాదానికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. బర్గారి గ్రామానికి చెందిన పూజ అనే యువతి పక్క గ్రామస్థుడైన యువకుడిని ప్రేమించింది. అతను కూడా పూజను ఇష్టపడ్డాడు. ఈ విషయం ఇరు కుటుంబాలకు చెప్పడంతో దుబాయ్‌లో పనిచేస్తున్న అతడితో పెళ్లికి రెండు కుటుంబాలు అంగీకరించాయి.  అతను దుబాయ్‌లో ఉండటంతో వీడియోకాల్‌ ద్వారా నిశ్చితార్థం చేశారు. ఇక పెళ్లికి ఈ నెల (అక్టోబర్‌) 24 న ముహూర్తంగా నిర్ణయించారు. పెళ్లి సమయానికి దుబాయ్‌ నుంచి పెళ్లికుమారుడు వచ్చాడు. అక్టోబరు 23 రాత్రి అమ్మాయి ఇంట్లో జాగరణ్‌ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పెళ్లికూతురు ఉత్సాహంగా భాంగ్రా నృత్యం చేస్తూ ఎంజాయ్‌ చేసింది. ఇంతలోనే ఉన్నట్టుండి ఆమె ముక్కు నుంచి రక్తం కారడం మొదలైంది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెన సమీప  వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే గుండెపోటుతో పూజ మరణించినట్లు వైద్యుడు ధ్రువీకరించారు. దీంతో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట విషాదం నిండింది.

Also Read:  తెలంగాణలో విషాదం. కుక్క కాటు గురించి దాచిపెట్టిన బాలిక.. నెల రోజుల తర్వాత రేబిస్‌తో మృతి

Advertisment
తాజా కథనాలు