/rtv/media/media_files/2025/10/26/wife-and-mother-in-law-conflict-drives-faridabad-husband-suicide-2025-10-26-15-26-23.jpg)
Wife and Mother in Law Conflict Drives Faridabad husband Suicide
ఫరీదాబాద్‌లో దారుణం జరిగింది. భర్త తల్లిని తమ ఇంట్లో ఉంచుకున్నందుకు భార్య రచ్చ రచ్చ చేసింది. వెంటనే ఆమెను బయటకు పంపించేయాలని తరచూ తన భర్తతో గొడవ పడేది. ఈ క్రమంలోనే భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా వాగ్వాదం చేసుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త 15 అంతస్తు నుంచి దూకి సూసైడ్(Husband suicide) చేసుకున్నాడు. ఈ ఘోరమైన విషాద ఘటన ప్రస్తుతం అందరినీ కలచివేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : ఏపీలో దారుణం.. 12 ఏళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం
షాకింగ్ ఇన్సిడెంట్
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన యోగేష్ కుమార్ గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో రేడియోథెరపిస్ట్‌గా పనిచేస్తున్నాడు. అతను తొమ్మిది సంవత్సరాల క్రితం నేహా రావత్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఆరేళ్ల పాప కూడా ఉంది. ఈ జంట గతంలో నోయిడాలో నివసించేవారు.. అక్కడ నేహాకు ప్రైవేట్ ఉద్యోగం ఉండేది. ఇక భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడంతో బిడ్డను చూసుకోలేకపోయారు.
దీంతో యోగేష్ తన తల్లిని తనతోనే ఉంచుకోవాలని కోరుకున్నాడు. కానీ అతడి భార్య నేహాతో పాటు ఆమె ఫ్యామిలీ దీనికి అంగీకరించలేదు. ఇదే విషయమై తరచూ భార్యభర్తలిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఓ వైపు భార్య వేధింపులు, మరోవైపు భార్య తరపు ఫ్యామిలీ గొడవలతో యోగేష్ విసిగిపోయాడు. దీని అనంతరం యోగేష్ ఆరు నెలల క్రితం తన బిడ్డతో కలిసి ఫరీదాబాద్ లోని సెక్టార్ 87లో పెర్ల్ సొసైటీకి మారాడు.
కానీ నేహా మాత్రం నోయిడాలోని తన ఫ్యామిలీ దగ్గరే ఉండిపోయింది. ఇదే సమయంలో యోగేష్ తన బిడ్డను చూసుకోవడానికి తన తల్లికి ఫోన్ చేశాడు. అయితే సుమారు ఒక నెల క్రితం నేహా యోగేష్ తో కలిసి నివసించడానికి ఫరిదాబాద్ లోని పెర్ల్ సొసైటీ అపార్ట్‌మెంట్‌కి వచ్చింది. అక్కడ కూడా ఆమె మరోసారి తన భర్త యోగేష్ తో గొడవ పడింది. తన అత్త తమతో కలిసి ఉండటం పట్ల నేహ అభ్యంతరం తెలిపింది. అదే సమయంలో నేహా సోదరులు ఆశిష్ రావత్, అమిత్ రావత్ కూడా గ్రేటర్ ఫరీదాబాద్ సొసైటీకి వచ్చి యోగేష్ తో వాదించారు.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యోగేష్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. నేహాను నోయిడాలో దింపి ఒంటరిగా అపార్ట్‌మెంట్‌కు తిరిగి వచ్చాడు. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి పెర్ల్ సొసైటీలోని 15వ అంతస్తు నుంచి దూకి అక్కడికక్కడే మరణించాడు. అనంతరం మృతుడి మామ ఫిర్యాదు మేరకు పోలీసులు.. మృతుడి భార్య నేహా రావత్, అత్త శాంతి రావత్, మామ వీర్ సింగ్ రావత్, నేహా సోదరులు ఆశిష్, అమిత్ రావత్ లపై కేసు నమోదు చేశారు.
Also Read : ప్యారిస్ మ్యూజియం చోరీ.. నెపోలియన్ ఆభరణాలు దొంగలించిన ఇద్దరు అరెస్ట్
Follow Us