Encounter: ఢిల్లీలో మరో ఎన్‌కౌంటర్‌...మూడురోజుల్లో  ఐదుగురు హతం

ఢిల్లీలో వరుస ఎన్‌కౌంటర్లు కలకలం రేపుతున్నాయి. తాజాగా  ఈ రోజు జరిగిన ఎన్‌ కౌంటర్‌లో ఒక వ్యక్తి హతమయ్యాడు.  ఆగ్నేయ ఢిల్లీలో ఈ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆయుధ డీలర్‌ తేజస్‌ అలియాస్‌ భరత్‌ (28)హతం అయినట్లు తెలుస్తోంది.

New Update
Encounter in Delhi.

Encounter in Delhi.

Encounter : ఢిల్లీలో వరుస ఎన్‌కౌంటర్లు(delhi encounter) కలకలం రేపుతున్నాయి. తాజాగా  ఈ రోజు జరిగిన ఎన్‌ కౌంటర్‌లో ఒక వ్యక్తి హతమయ్యాడు(gangster).  ఆగ్నేయ ఢిల్లీలో ఈ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆయుధ డీలర్‌ తేజస్‌ అలియాస్‌ భరత్‌ (28)హతం అయినట్లు తెలుస్తోంది. తేజస్‌ జరిపిన కాల్పుల్లో ఎవరికి గాయాలు కాలేదు. బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ధరించడంతో కానిస్టేబుల్‌ ఎన్‌కౌంటర్‌ నుండి బయటపడ్డాడు.  

దీపావళి రాత్రి తైమూర్ నగర్‌లో జరిగిన కాల్పుల ఘటనలో నిందితుడిగా ఉన్న తేజస్ అలియాస్ భరత్  ఆగ్నేయ ఢిల్లీలో దాక్కున్నాడు. గత ఐదు రోజులుగా పరారీలో ఉన్న ఆయుధ సరఫరాదారు తేజస్ అలియాస్ భరత్ (28) ఆ ప్రాంతంలో ఉన్నాడని సమాచారం అందడంతో పోలీసులు ఆస్తా కుంజ్ పార్క్ సమీపంలో వల వేసినట్లు పోలీసులు తెలిపారు.పోలీసు బృందం అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించి నప్పుడు, తేజస్ వారిపై కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ హెడ్ కానిస్టేబుల్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను తాకింది" అని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ప్రతీకారంగా, పోలీసు బృందం ఆత్మరక్షణ కోసం అతనిపై తిరిగి కాల్పులు జరిపి, అతన్ని బలవంతంగా చికిత్స కోసం ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారని అధికారి తెలిపారు.పోలీసులు సంఘటనా స్థలం నుండి ఒక కంట్రీ మేడ్ పిస్టల్, మూడు లైవ్ కార్ట్రిడ్జ్‌లు రెండు ఖాళీ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. తేజస్ పై హత్యాయత్నం, ఆయుధ చట్టం ,ఎక్సైజ్ చట్టం కింద తొమ్మిది క్రిమినల్ కేసుల నమోదు చేయబడ్డాయని తెలిపారు.

Also Read :  తెల్లారితే పెళ్లి.. అంతలోనే... నృత్యం చేస్తూ వధువు మృతి

Another Encounter In Delhi

కాగా, ఇటీవల మెహ్రౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉదయం 4 గంటలకు పోలీసులకు- వాంటెడ్ క్రిమినల్ కోకు పహాడియాకు మధ్య కాల్పులు జరిగాయి. మొదట నేరస్థుడు కాల్పులు జరపగా.. అనంతరం పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. నేరస్థుడు జరిపిన కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ రవీంద్రకు గాయాలు కాగా.. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లను ధరించిన మరో ఇద్దరు పోలీసులకు ప్రమాదం తప్పింది. ఎట్టకేలకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎదురుకాల్పుల్లో పహాడియాకు గాయాలు కావడంతో చికిత్స కోసం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆయుధ సరఫరాతో పాటు అనేక కేసుల్లో పహాడియా వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్నారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

ఇటీవల రోహిణి ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతమైన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్ లో సిగ్మా గ్యాంగ్ నాయకుడు రంజన్ పాఠక్ సహా నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు. ఈ నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లుగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, బీహార్ పోలీసుల సంయుక్తంగా జరిపిన దాడిలో ఈ నలుగురు గ్యాంగ్‌స్టర్లు చనిపోయారు. అక్టోబర్ 22-23 మధ్య రాత్రి 2:20 గంటలకు ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ నలుగురు బీహార్‌లో పలు తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. సిగ్మా అండ్ కంపెనీగా పిలిచే ఈ ముఠాకు రంజన్ పాఠక్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ నలుగురు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ కుట్రకు ప్రణాళిక రచించినట్లుగా పోలీసులు గుర్తించారు. కుట్ర ఛేదించే క్రమంలో పోలీస్ బృందాలు గాలిస్తుండగా గ్యాంగ్‌స్టర్లు కాల్పులకు తెగబడడంతో పోలీసులు నలుగురిని హతమార్చారు.

Also Read:  తెలంగాణలో విషాదం. కుక్క కాటు గురించి దాచిపెట్టిన బాలిక.. నెల రోజుల తర్వాత రేబిస్‌తో మృతి

Advertisment
తాజా కథనాలు