/rtv/media/media_files/2025/10/22/paris-museum-2025-10-22-17-28-45.jpg)
Paris Museum: పారిస్‌లో ప్రపంచ ప్రఖ్యాతగాంచిన లౌవ్రే మ్యూజియంలో చోరీకి సంబంధించి ఇద్దరు వ్యక్తులను ఫ్రెంచ్ పోలీసులు అరెస్టు చేశారు. నెపోలియన్ సామ్రాజ్య కాలం నాటి అత్యంత విలువైన ఆభరణాల చోరీ జరిగి వారం తర్వాత ఈ అరెస్టులు జరగడం సంచలనం సృష్టించింది. ఈ భారీ దొంగతనంపై విచారణ చేపట్టిన వంద మందికి పైగా పోలీసులతో స్పెషల్ టీం ఎట్టకేలకు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుంది. వారిలో ఒకరిని దేశం విడిచి వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా పారిస్‌లోని చార్లెస్ డి గోల్ విమానాశ్రయంలో అరెస్టు చేయగా, మరొకరిని పారిస్ శివారు ప్రాంతంలో అరెస్టు చేసినట్లు ఫ్రెంచ్ మీడియా వర్గాలు తెలిపాయి. అరెస్టయిన ఇద్దరూ 30 ఏళ్ల వయస్సులో ఉన్నట్లు తెలుస్తోంది.
Two men arrested over $100M Louvre Museum jewel heist — as one suspect was busted at airport trying to flee country: report https://t.co/hhScZVxzAKpic.twitter.com/3TODtTMckc
— New York Post (@nypost) October 26, 2025
Also Read : రష్యా అమ్ములపొదిలోకి సరికొత్త క్షిపణి.. అమెరికాకు సవాల్
'సినిమా స్టైల్' దోపిడీ
అక్టోబర్ 19, 2025న, ప్యారిస్‌లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే లౌవ్రే మ్యూజియంలో పట్టపగలే ఈ దోపిడీ(Louvre Museum Robbery) జరిగింది. సుమారు నలుగురు సభ్యులున్న దొంగల ముఠా, సినిమా స్టైల్లో ఓ దొంగిలించిన లారీలోని ఎక్స్‌టెండబుల్ నిచ్చెన సాయంతో మ్యూజియం భవనంపైకి ఎక్కారు. అపోలో గ్యాలరీ కిటికీలను కట్టర్లతో పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. కేవలం ఏడు నిమిషాల స్వల్ప వ్యవధిలోనే వీరు దాదాపు 102 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 850 కోట్లు) విలువైన ఎనిమిది అపురూప ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
దొంగిలించిన వాటిలో నెపోలియన్ బొనాపార్టే రెండవ భార్య ఎంప్రెస్ మేరీ-లూయిస్‌కు బహూకరించిన పచ్చ, వజ్రాల నెక్లెస్, 19వ శతాబ్దపు రాణులైన మేరీ-అమేలీ మరియు హార్టెన్స్ నీలమణి ఆభరణాల సెట్‌లోని కిరీటం (డయాడెమ్), నెక్లెస్ వంటి చారిత్రక విలువైన వస్తువులు ఉన్నాయి. అయితే, తప్పించుకునే క్రమంలో దొంగలు వజ్రాలు, పచ్చలు పొదిగిన కిరీటం ఒకదాన్ని మ్యూజియం బయట పడేయడంతో, అది డ్యామేజైయి లభ్యమైంది.
Also Read : భారత్ సహా నాలుగు దేశాలను కుదిపేసిన భారీ భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
Follow Us