ఆంధ్రప్రదేశ్ AP: హత్యకు కారణమైన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదం.. దారి కాచి మరి..! ఏలూరు జిల్లా ఊటుకూరులో జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదం హత్యకు కారణమైనట్లు తెలుస్తోంది. బాలకోటయ్య అనే వ్యక్తిని ప్రత్యర్ధులు కత్తులతో నరికి చంపారు. గతంలో ఎన్టీఆర్ ఫ్లెక్సీలను పెట్టిన సందర్భంలో వివాదం తలెత్తిందని ఆ కక్ష కారణంగానే అతడిని హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. By Jyoshna Sappogula 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ RTC: RTC బస్సుతో యువకుడి ప్రాంక్ వీడియో.. సజ్జనార్ సీరియస్! ఏపీ ఆర్టీసీ బస్సుతో ఫ్రాంక్ వీడియో చేసిన యువకుడిపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. 'ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందనే సోయి మరిచి వికృతానందం పొందుతున్నారు. లైక్‌లు, కామెంట్ల కోసం పిచ్చి పనులు మానుకోండి. జీవితంలో ఉన్నతంగా ఎదగండి' అంటూ చురకలంటించారు. By srinivas 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Electric shock: గణపతి మండపంలో విషాదం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు బాలురు మృతి! ఏపీ, తెలంగాణలోని పలు గణపతి మండపం వద్ద విషాదాలు చోటుచేసుకున్నాయి. ఏపీ అన్నమయ్య జిల్లా రాయచోటిలోని మహేశ్ అనే బాలుడు కరెంట్ షాక్‌తో చనిపోయాడు. తెలంగాణ మేడ్చల్-మల్కాజ్ గిరి దూలపల్లిలో నవీన్ సైతం మండపం దగ్గర విద్యుదాఘాతంతో మరణించాడు. By srinivas 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ FLASH: ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మంది... AP: శ్రీసత్యసాయి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. గుమ్మలకుంట దగ్గర బస్సు ముందు టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. 15మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. By V.J Reddy 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pavitra Gowda- Darshan: శృంగార ఫొటోలు పంపి.. ఉచ్చులోకి లాగి: రేణుకాస్వామి హత్యలో సంచలన నిజాలు! కన్నడ నటుడు దర్శన్, నటి పవిత్రగౌడ కలిసి చేసిన రేణుకాస్వామి హత్యకేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పవిత్రకు రేణుకస్వామి శృంగార ఫొటో, వీడియోలతోపాటు తన మర్మాంగం చిత్రాలు కూడా పంపినట్లు ఆధారాలు బయటపడ్డాయి. By srinivas 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Rape case: మహిళకు లిఫ్ట్ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డ యువకులు! తమిళనాడు పూతలూర్‌లో 42 ఏళ్ల మహిళపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. పనులు ముగించుకుని తిరుగుప్రయాణంలో రాత్రి బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న ఆమెకు లిఫ్ట్ ఇస్తామని చెప్పి ప్రవీణ్, రాజ్‌కపూర్ అనే వ్యక్తులు అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం UP Accident: హథ్రస్లో ఘోర ప్రమాదం.. 15 మంది దుర్మరణం! యూపీ హథ్రస్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు వ్యాన్‌ను ఓవర్ టెక్ చేసే క్రమంలో వ్యాన్‌ను బలంగా ఢీ కొట్టింది. 15 మంది దుర్మరణం చెందగా 16 మంది గాయపడ్డారు. మోదీ, సీఎం యోగి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. By srinivas 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Constable Suicide: బిడ్జిపై నుంచి దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రమణ అనే కానిస్టేబుల్ భద్రాచలం బిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియోను రమణ విడుదల చేశాడు. ఆరోగ్య సమస్యల వల్లే తాను చనిపోతున్నట్లు ఆ వీడియోలో చెప్పాడు. ప్రస్తుతం అతని మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. By V.J Reddy 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: లేడీ కిల్లర్స్.. అప్పు తీసుకుంటారు, అడిగితే చంపేస్తారు..! గుంటూరు జిల్లా వడ్లమూడిలో ఓ మహిళ అనుమానాస్పద మృతి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు మహిళలు అప్పు తీసుకొని.. మళ్లీ అడిగితే కూల్‌డ్రింక్‌లో సైనైడ్ కలిపి చంపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. 4 హత్యలు, 3 హత్యాయత్నాలు చేసిన లేడీ కిల్లర్స్ ను అరెస్టు చేశారు. By Jyoshna Sappogula 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn