Hyderabad Terrorist: ఆస్ట్రేలియా ఉగ్రదాడి వెనుక హైదరాబాద్ టెర్రరిస్ట్.. షాకింగ్ విషయాలు

సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌లోని టోలిచౌకీ (అల్హస్నత్ కాలనీ) నివాసి. ఇతని సోదరుడు స్థానికంగా డాక్టర్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోనే బి.కామ్ పూర్తి చేసిన సాజిద్, 1998 నవంబర్‌లో స్టూడెంట్ వీసాపై ఉద్యోగ వేటలో ఆస్ట్రేలియాకు వెళ్లాడు.

New Update
Astrelia terror attack

ఆస్ట్రేలియా సిడ్నీలోని ప్రసిద్ధ బోండీ బీచ్ వద్ద జరిగిన ఉగ్రదాడి(australia terror attack link to hyderabad)లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడికి పాల్పడిన ఇద్దరు టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో 16 మంది చనిపోయారు. ఈ అటాక్‌ జరిపిన వారిలో ఒకరైన సాజిద్ అక్రమ్(50) హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి(hyderabad terrorist) అని తెలంగాణ పోలీసులు ధృవీకరించారు. నిందితుడు 27 ఏళ్ల క్రితమే హైదరాబాద్‌ను విడిచి ఆస్ట్రేలియాకు వలస వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది.

గత ఆదివారం (డిసెంబర్ 14) బోండీ బీచ్‌లో హనుక్కా వేడుకలు జరుగుతుండగా, సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నవీద్ అక్రమ్ (24) విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 16 మంది మరణించగా, 40 మందికి పైగా గాయపడ్డారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో సాజిద్ అక్రమ్ అక్కడికక్కడే మరణించగా, అతని కుమారుడు నవీద్ గాయాలతో చికిత్స పొందుతున్నాడు.

Also Read :  మోదీ పర్యటనలో.. ఇండియా-జోర్డాన్‌‌ 5 కీలక ఒప్పందాలు ఇవే!

హైదరాబాద్‌తో సంబంధాలు

సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌లోని టోలిచౌకీ (అల్హస్నత్ కాలనీ) నివాసి. ఇతని సోదరుడు స్థానికంగా డాక్టర్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోనే బి.కామ్ పూర్తి చేసిన సాజిద్, 1998 నవంబర్‌లో స్టూడెంట్ వీసాపై ఉద్యోగ వేటలో ఆస్ట్రేలియాకు వెళ్లాడు. సాజిద్ అక్రమ్ ఇంకా ఇండియన్ పాస్‌పోర్టుతోనే ఉన్నాడు. అయితే అతని కుమారుడు నవీద్ ఆస్ట్రేలియాలోనే జన్మించడంతో అతనికి ఆస్ట్రేలియా పౌరసత్వం ఉంది.

ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత ఓ యూరోపియన్ యువతిని వివాహం చేసుకున్న సాజిద్, తన కుటుంబంతో సంబంధాలను తగ్గించుకున్నాడు. గత 27 ఏళ్లలో కేవలం ఆరుసార్లు మాత్రమే భారత్‌కు వచ్చాడు. చివరిసారిగా 2022లో నగరాన్ని సందర్శించాడు. 2017లో తండ్రి మరణించినప్పుడు కూడా అతను రాలేదని సమాచారం. ఆస్ట్రేలియా అధికారులు ఈ దాడిని ఇస్లామిక్ స్టేట్ భావజాలంతో ప్రేరేపితమైన ఉగ్రదాడిగా భావిస్తున్నారు. నిందితుల కారులో బాంబులు, ఐసిస్ జెండాలు లభించాయి. అలాగే దాడికి ముందు వీరు ఫిలిప్పీన్స్‌లో సైనిక తరహా శిక్షణ పొందినట్లు అనుమానిస్తున్నారు. తెలంగాణ పోలీసులు స్పందిస్తూ.. సాజిద్ అక్రమ్‌కు ఇక్కడ ఉన్నప్పుడు ఎలాంటి క్రిమినల్ బ్యాగ్‌గ్రౌండ్ లేదని, అతని తీవ్రవాద ఆలోచనలతో భారత్‌కు లేదా ఇక్కడి స్థానిక ప్రభావాలకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

Also Read :  కోల్‌కతాలో మెస్సి ఈవెంట్‌పై రచ్చ.. రాజీనామా చేసిన క్రీడాశాఖ మంత్రి

Advertisment
తాజా కథనాలు