Ghost Pairing: వాట్సాప్‌లో కొత్త మోసం.. 'ఘోస్ట్ పేయిరింగ్'తో జాగ్రత్త!

వాట్సాప్ అకౌంట్‌ హ్యాకర్ తన బ్రౌజర్ లేదా మరో డివైజ్‌కు సీక్రెట్‌గా లింక్ చేసుకోవడాన్ని ఘోస్ట్ పేయిరింగ్ అంటారు. దీంతో మీ మెసేజ్‌లు, ఫోటోలు, కాల్స్ అన్నీ హ్యాకర్‌కు కనిపిస్తాయి, కానీ మీ ఫోన్ మీ దగ్గరే ఉంటుంది కాబట్టి మీరు హ్యాక్ అయ్యారని గుర్తించడం కష్టం.

New Update
'Ghost Pairing'

వాట్సాప్‌లో ఇటీవల వెలుగులోకి వచ్చిన అత్యంత ప్రమాదకరమైన సైబర్ నేరాలలో(Cyber Attacks On India) 'ఘోస్ట్ పేయిరింగ్' ఒకటి. దీని గురించి హైదరాబాద్ సీపీ సజ్జనార్(CP Sajjanar) కూడా అలర్ట్ చేశారు. ఇందులో సాధారణంగా హ్యాకర్లు మీ పాస్‌వర్డ్ లేదా ఓటీపీ దొంగిలించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ పద్ధతిలో మీ ప్రమేయంతోనే మీ అకౌంట్‌ను వారి ఆధీనంలోకి తీసుకుంటారు. ఘోస్ట్ పేయిరింగ్ అంటే ఏంటో, అది ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..

Also Read :  ISRO ఖాతాలో మరో విజయం.. గగన్‌యాన్ పారాచూట్‌ టెస్ట్ సక్సెస్

ఘోస్ట్ పేయిరింగ్ అంటే ఏమిటి?

మీ వాట్సాప్ అకౌంట్‌ను హ్యాకర్ తన బ్రౌజర్ లేదా మరో డివైజ్‌కు సీక్రెట్‌గా లింక్ చేసుకోవడాన్ని 'ఘోస్ట్ పేయిరింగ్'(Ghost Pairing) అంటారు. దీనివల్ల మీ మెసేజ్‌లు, ఫోటోలు, కాల్స్ అన్నీ హ్యాకర్‌కు కనిపిస్తాయి, కానీ మీ ఫోన్ మీ దగ్గరే ఉంటుంది కాబట్టి మీరు హ్యాక్ అయ్యారని గుర్తించడం చాలా కష్టం. - New cyber scam

మీకు తెలిసిన వ్యక్తి నుంచో లేదా నమ్మదగిన నంబర్ నుంచో "హే.. నీ ఫోటో ఒకటి ఆన్‌లైన్‌లో చూశాను, ఇది నువ్వేనా?" అనే మెస్సేజ్‌తో పాటు ఓ లింక్ వస్తుంది. మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే అది ఒక ఫేస్‌బుక్ లాంటి పేజీకి తీసుకువెళుతుంది. అక్కడ ఫోటో చూడాలంటే మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు నంబర్ ఇవ్వగానే, హ్యాకర్ తన కంప్యూటర్‌లో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసి మీ నంబర్ ఎంటర్ చేస్తాడు. అప్పుడు మీ వాట్సాప్‌కు ఒక 'పేయిరింగ్ కోడ్' (8 అంకెల కోడ్) వస్తుంది. ఆ నకిలీ పేజీలో "మీరు రోబోట్ కాదని నిరూపించుకోవడానికి మీ వాట్సాప్‌కు వచ్చిన కోడ్‌ను అక్కడ ఎంటర్ చేయండి" అని అడుగుతారు. మీరు ఆ కోడ్ ఎంటర్ చేయగానే, హ్యాకర్ డివైజ్ మీ అకౌంట్‌తో లింక్ అయిపోతుంది.

రహస్య నిఘా:దీంతో మీ వ్యక్తిగత చాట్‌లు, గ్రూప్ మెసేజ్‌లు అన్నీ హ్యాకర్ లైవ్‌లో చూడగలడు.
డేటా చోరీ: మీ అకౌంట్‌లోని ఫోటోలు, వీడియోలు, బ్యాంకింగ్ వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మాల్‌వేర్ వ్యాప్తి: మీ పేరుతో మీ కాంటాక్ట్స్ అందరికీ అవే మోసపూరిత లింక్‌లను పంపి వారిని కూడా బాధితులను చేస్తారు.

Also Read :  Google Gemini 3కి పోటీగా OpenAI GPT-5.2 లాంచ్..!

జాగ్రత్త పడండి ఇలా.. 

అపరిచిత లింకులు: ఎవరైనా పంపిన లింక్‌లు క్లిక్ చేసి మీ వ్యక్తిగత సమాచారం లేదా ఫోన్ నంబర్లు ఎంటర్ చేయవద్దు.
లింక్డ్ డివైజెస్ తనిఖీ: వాట్సాప్ సెట్టింగ్స్‌లో 'Linked Devices' ఆప్షన్‌ను తరచుగా చెక్ చేయండి. మీకు తెలియని డివైజ్ ఏదైనా కనిపిస్తే వెంటనే 'Log Out' చేయండి.
టూ-స్టెప్ వెరిఫికేషన్: మీ వాట్సాప్‌లో ఈ ఫీచర్‌ను తప్పనిసరిగా ఆన్ చేసుకోండి. దీనివల్ల ఎవరైనా మీ అకౌంట్‌ను లింక్ చేయాలన్నా అదనపు పిన్ అడుగుతుంది.
నోటిఫికేషన్లు గమనించండి: మీ ఫోన్‌లో "A new device is being linked" అనే నోటిఫికేషన్ వస్తే, మీరు చేయనట్లయితే వెంటనే దానిని నిలిపివేయండి.

Advertisment
తాజా కథనాలు