Crime: దారుణం.. కట్నం కోసం భార్యను చంపిన భర్త

వికారాబాద్ జిల్లా తాండూరులో మరో దారుణం జరిగింది. అదనపు కట్నం కోసం భార్యను భర్త కొట్టి చంపడం కలకలం రేపింది. వీళ్లిద్దరిది ప్రేమ వివాహం కావడం గమనార్హం. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

New Update
husband beats wife to death in vikarabad district

husband beats wife to death in vikarabad district

ఈమధ్య వరకట్న వేధింపులకు ఎంతోమంది మహిళలు బలవుతున్నారు. కొందరు ఆత్మహత్య చేసుకొని చనిపోతుంటే మరికొందరిని అత్తింటివారే హత్యలు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరులో మరో దారుణం జరిగింది. అదనపు కట్నం కోసం భార్యను భర్త కొట్టి చంపడం కలకలం రేపింది. వీళ్లిద్దరిది ప్రేమ వివాహం కావడం గమనార్హం. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరులోని సాయుపూర్‌కు చెందిన పరమేశ్‌తో అనుష(22)కు 8 నెలల క్రితం ప్రేమ వివాహం జరిగింది.  

Also Read: రిటైర్మెంట్ ముందు సిక్స్ లు..న్యాయవ్యవస్థపై సీజేఐ సంచలన వ్యాఖ్యలు

వివాహం తర్వాత అనుష తన భర్త, అత్తమామలతో కలిసి ఉంటోంది. గత కొన్నిరోజులుగా అనుషకు వరకట్న వేధింపులు ఎదురవుతున్నాయి. కట్నం తీసుకురావాలని అత్త,మామ,భర్త వేధించడం మొదలుపెట్టారు. మూడు రోజుల క్రితం భర్త పరమేశ్ ఆమెపై దాడి చేశాడు. దీంతో అనుషకు గాయాలయ్యాయి. ఆమె తల్లి, సోదరుడు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అయితే గురువారం సోదరుడితో కలిసి అనుష పుట్టింటికి వెళ్తుండగా పరమేశ్‌ ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. ఇంట్లో మళ్లీ వాళ్లిద్దరికి గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహంతో ఉన్న పరమేశ్‌ అనుషను కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. స్థానికులు ఆస్పత్రికి ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.  

Also Read: మాదక ద్రవ్యాల నుంచి చమురుకు..ముదిరిన అమెరికా, వెనిజులా యుద్ధం..

Advertisment
తాజా కథనాలు