Burqa: బురఖా ధరించలేదని భార్యాబిడ్డలను దారుణ హత్య.. ఆధార్ కార్డు కూడా!

ఉత్తరప్రదేశ్‌లోని శాంమ్లీ జిల్లాలో బురఖా ధరించలేదన్న కోపంతో ఓ వ్యక్తి భార్యతో పాటు ఇద్దరు మైనర్ కుమార్తెలను అతి కిరాతకంగా చంపేశాడు. నిందితుడు భార్య ముఖం బయటి వ్యక్తులకు కనిపిస్తుందనే పిచ్చితో ఆమెకు ఆధార్ కార్డు కూడా తీయించలేదని విచారణలో తేలింది.

New Update
UP Man

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh crime) లోని శాంమ్లీ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బురఖా ధరించలేదన్న కోపంతో ఓ వ్యక్తి తన భార్యతో పాటు ఇద్దరు మైనర్ కుమార్తెలను అతి కిరాతకంగా చంపేశాడు. నిందితుడు తన భార్య ముఖం బయటి వ్యక్తులకు కనిపిస్తుందనే పిచ్చితో ఆమెకు ఆధార్ కార్డు(aadhaar-card) కూడా తీయించకపోవడం పోలీసుల విచారణలో తేలింది. ఘరీ దౌలత్ గ్రామానికి చెందిన ఫరూక్ అనే వ్యక్తికి, అతని భార్య తాహిరా (35) మధ్య గత కొంతకాలంగా బురఖా విషయంలో గొడవలు జరుగుతున్నాయి. తాహిరా తన పుట్టింటికి వెళ్లేటప్పుడు లేదా బయటకు వెళ్లేటప్పుడు బురఖా ధరించడం లేదని ఫరూక్ అనుమానించేవాడు. ఇటీవల తాహిరా బురఖా లేకుండా బయటకు వెళ్లడం తన పరువు తీసినట్లుగా భావించిన ఫరూక్, ఆమెపై తీవ్ర ఆగ్రహం పెంచుకున్నాడు.

Also Read :  పార్లమెంట్‌లో ‘శాంతి’ బిల్లు ఆమోదం.. న్యూక్లియర్ రంగంలో కీలక మార్పులు!

ఆధార్ కార్డు కూడా వద్దు!

పోలీసుల దర్యాప్తులో నిందితుడి మానసిక స్థితిని ప్రతిబింబించే మరో షాకింగ్ విషయం బయటపడింది. ఆధార్ కార్డు కోసం ఫోటో తీయించుకుంటే తన భార్య ముఖం ప్రభుత్వ రికార్డుల్లోనూ, ఇతరులకు కనిపిస్తుందనే ఉద్దేశంతో ఫరూక్ ఆమెకు ఆధార్ కార్డు కూడా తీయించలేదని తెలిసింది. తన భార్య ముఖం తనకి తప్ప మరెవరికీ కనిపించకూడదనే సంకుచిత భావంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Also Read :  భారత్‌-ఒమన్‌ మధ్య కీలక ఒప్పందం

భార్య, ఇద్దరు కుమార్తెల హత్య

డిసెంబర్ 10న దంపతుల మధ్య బురఖా విషయంలో మరోసారి తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన ఫరూక్, తన భార్య తాహిరాను హత్య చేశాడు. అది చూసిన అతని కుమార్తెలు షెహ్రీన్(14), ఆఫ్రీన్ (6) గట్టిగా కేకలు వేశారు. విషయం బయటకు తెలిసిపోతుందనే భయంతో వారిని కూడా అతి దారుణంగా చంపేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా తన ఇంట్లోనే ఒక లోతైన గోతిని తీసి ముగ్గురి మృతదేహాలను పాతిపెట్టాడు. దాదాపు వారం రోజుల పాటు ఏమీ ఎరుగనట్లు ఫరూక్ అదే ఇంట్లో ఉన్నాడు. అయితే, ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పాటు, అతని భార్యాబిడ్డలు కనిపించకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ఫరూక్‌ను తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. నిందితుడు చూపిన ప్రదేశంలో పోలీసులు తవ్వకాలు జరిపి కుళ్ళిపోయిన మృతదేహాలను వెలికితీశారు. ఈ దారుణ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ కేసును 'పరువు హత్య' కోణంలో కూడా విచారిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు