/rtv/media/media_files/2025/12/21/16-epstein-files-2025-12-21-07-49-35.jpg)
అమెరికాను వణికించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం(Jeffrey Epstein sex scandal) కేసులో షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అమెరికా న్యాయశాఖ అధికారిక వెబ్‌సైట్(US Government Website)లో విడుదల చేసిన పత్రాల్లోని 16 కీలక ఫైళ్లు అకస్మాత్తుగా మాయం కావడం ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ముఖ్యంగా, మాయమైన ఈ ఫైళ్లలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఫోటో(Trump Photo) కూడా ఉండటం గమనార్హం.
ప్రజల డిమాండ్, కాంగ్రెస్ విధించిన గడువు మేరకు డిసెంబర్ 19 (శుక్రవారం) నాడు అమెరికా న్యాయశాఖ ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన వేల పేజీల పత్రాలను, ఫోటోలను బహిర్గతం చేసింది. అయితే, శనివారం ఉదయానికే 16 ఫైళ్లు వెబ్‌సైట్ నుండి తొలగించబడ్డాయి. ప్రభుత్వం దీనిపై ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకపోవడం లేదా వివరణ ఇవ్వకపోవడంపై ప్రతిపక్ష డెమోక్రాట్లు మండిపడుతున్నారు.
Also Raed : హాదీ మరణం దేశానికి తీరని లోటు... భావోద్వేగానికి గురైన యూనస్
మాయమైన 'ఫైల్ 468'
తొలగించబడిన ఫైళ్లలో 'ఫైల్ 468'(Epstein Files) అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఈ ఫోటోలో డొనాల్డ్ ట్రంప్, జెఫ్రీ ఎప్స్టీన్, ఆయన అనుచరురాలు గిస్లైన్ మాక్స్వెల్, మెలానియా ట్రంప్ కలిసి ఉన్నారు. ఇది 2000వ సంవత్సరంలో మార్-ఎ-లాగోలో తీసిన ఫోటోగా భావిస్తున్నారు. డెమోక్రాట్లు ఈ అంశంపై స్పందిస్తూ, "ఈ ఫోటోను ఎందుకు తొలగించారు? ప్రభుత్వం ఇంకా వేటిని దాచడానికి ప్రయత్నిస్తోంది?" అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
కేవలం ట్రంప్ ఫోటో మాత్రమే కాకుండా, వెబ్‌సైట్ నుండి మరికొన్ని సున్నితమైన ఆధారాలు కూడా మాయమయ్యాయి. ఎప్స్టీన్ నివాసంలో లభించిన కొన్ని నగ్న చిత్రాలు, పెయింటింగ్‌లకు సంబంధించిన ఫైళ్లు తొలగించబడ్డాయి. మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, పోప్ వంటి ప్రముఖుల ఫోటోలు ఉన్న ఫ్రేమ్‌ల చిత్రాలు కూడా వెబ్‌సైట్‌లో కనిపించడం లేదని మీడియా సంస్థలు గుర్తించాయి. బాధితుల వాంగ్మూలాలు, అంతర్గత మెమోలలోని కొన్ని భాగాలు కూడా మాయమైనట్లు సమాచారం.
వైట్ హౌస్ ప్రతినిధులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. ట్రంప్ ప్రభుత్వం చరిత్రలోనే అత్యంత పారదర్శకమైన ప్రభుత్వమని, బాధితుల గోప్యతను కాపాడటానికే కొన్ని వివరాలను ఎడిట్ చేయాల్సి వస్తోందని వారు పేర్కొన్నారు.
Also Read : పక్క దేశాలను భయపెడుతున్న చైనా త్రీగోర్జెస్ ఆనకట్ట.. ఆందోళనలో భారత్
Follow Us