BEAKING: తెలంగాణలో దారుణ హత్య.. కత్తులు స్కూడ్రైవర్లతో పొడిచి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో దారుణ హత్య చోటుచేసుకుంది. చర్ల రోడ్‌లోని తిరుమల వైన్స్‌ ఎదురుగా ఓ వ్యక్తిని దుండగులు కత్తులు, స్కూడ్రైవర్లతో పొడిచారు. తీవ్రరక్తస్రావమైన బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు.

New Update
A man killed by assailants in Bhadrachalam

A man killed by assailants in Bhadrachalam

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో దారుణ హత్య చోటుచేసుకుంది. చర్ల రోడ్‌లోని తిరుమల వైన్స్‌ ఎదురుగా ఓ వ్యక్తిని దుండగులు కత్తులు, స్కూడ్రైవర్లతో పొడిచారు. తీవ్రరక్తస్రావమైన బాధితుడుని స్థానికులు భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు యత్నించారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుడు పాల్వంచ పట్టణం ఒడ్డుగూడెంకు చెందిన సజ్జా రవిగా గుర్తించారు. దాడికి పాల్పడ్డవాళ్ల భద్రాచలం టౌన్‌ పరిధిలోని రాజుపేటకు చెందిన రౌడీగ్యాంగ్‌గా గుర్తించారు. 

Also Read: ఇక నుంచి పది గంటల ముందే ఛార్ట్..రైల్వే కీలక నిర్ణయం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సజ్జా రవి భద్రాచలంలో బంధువుల ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు పాల్వంచ నుంచి వచ్చాడు. ఈ క్రమంలోనే సన్నిహితులతో కలిసి మద్యం సేవించేందుకు చర్ల రోడ్‌లోని తిరుమల వైన్స్‌కు చేరుకున్నారు. సరిగ్గా అదే సమయంలో రాజుపేటకు చెందిన రౌడీ గ్యాంగ్‌ కూడా వైన్‌షాపు వద్దకు వచ్చింది.  తమ బైక్‌కు వారి బైక్ తగిలించారంటూ ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సజ్జారవి, అతని స్నేహితులపై రౌడీ గ్యాంగ్ రాళ్లు, కత్తులు, స్కూడ్రైవర్లతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలోనే తీవ్ర గాయాలపాలైన సజ్జారవి ప్రాణాలు కోల్పోయాడు. 

Also read: కిడ్నాపర్లను పట్టించిన స్మార్ట్‌వాచ్.. చిన్న తప్పుతో అందరూ జైలులోకి

ఇదిలాఉండగా గతంలో కూడా భద్రాచలం పట్టణానికి చెందిన ఓ యువకుడిని అతడి ఇంట్లోకి చొరబడి మరి రౌడీ మూకలు హత్య చేశాయి. మద్యం, గంజాయి మత్తులో భద్రచలంలో రౌడీ మూకలు పేట్రేగిపోతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి రౌడీలపై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు