BREAKING: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
తెలంగాణలోని హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. డీసీఎం వ్యాన్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లో మృతి చెందారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తెలంగాణలోని హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. డీసీఎం వ్యాన్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లో మృతి చెందారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
పెళ్లికి వెళ్లినప్పుడు ఏడు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురికావడంతో మనస్తాపం చెందిన ఓ వివాహిత తన రెండున్నరేళ్ల కొడుకుతో కలిసి తన ఇంటి మూడో అంతస్తు నుంచి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వనస్థలిపురంలో చోటుచేసుకుంది.
పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న సీరియల్ కిల్లర్ దేవేంద్ర శర్మను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఇతను మనుషుల్ని కిరాతకంగా చంపేసి యూపీలోని కాస్గంజ్లో మొసళ్లు ఎక్కువ ఉండే హజారా కాల్వలో పడేసేవాడు. ఇతను 50కు పైగా హత్యలను చేశాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. కానిస్టేబుల్ వేధింపులకు వివాహిత బలైంది. బత్తుల త్రివేణి అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. త్రివేణిని కొంతకాలంగా కానిస్టేబుల్ బత్తుల నాగరాజు మానసికంగా వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో మ్యారేజ్ బ్యూరోల పేరుతో మోసాలు ఎక్కువయ్యాయి. అన్ని వయస్సుల వారికి పెళ్లిళ్లు చేస్తామని నమ్మించి అందినకాడికి దండుకొని మోసం చేస్తున్నారు. తాజాగా ఓ వృద్దుడికి పెళ్లి చేస్తామని నమ్మించి లక్షలు వసూలు చేసి పారి పోయిన కీలేడీల విషయం వెలుగు చూసింది.
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైయిన కన్నడ హీరోయిన్ రన్యారావు, తరుణ్ రాజ్‌లకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.2లక్షల చొప్పున బాండ్, షరతులతో ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ఇచ్చింది. ప్రస్తుతం వీరు బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర జైలులో ఉన్నారు.
గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో వేలాదిమంది తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అక్కడి పిల్లలకు ఆహారం దొరకక వేలమంది శిశువులు చనిపోతున్నారని ఐరాస తెలిపింది. మరో 48 గంటల్లో వారికి ఆహారం అందకపోతే 14 వేలమంది పసివాళ్లు మరణించే అవకాశం ఉందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది.
కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ..సోషల్ మీడియాలో పోస్టులు చేసిన కేరళకు చెందిన విద్యార్థి రెజాజ్ ఎం షీబా సిద్ధిఖ్‌ను మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అదుపులోకి తీసుకున్నవిషయం తెలిసిందే. రెజాజ్‌కు పలు ఉగ్రసంస్థలలో సభ్వత్యం ఉందని గుర్తించాయి.
రైల్లో హిజ్రాలు రెచ్చిపోయారు. ఓ ప్రయాణికుడి నుంచి ఏకంగా రూ. 10వేలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న రైలులో సదురు ప్రయాణికుడి వద్ద డబ్బులు డిమాండ్ చేసిన వాళ్లు ఆపై అతని వద్ద పర్సు లాక్కున్నారు.