/rtv/media/media_files/2025/05/20/rIfSsrWtohIn4PamN15Y.jpg)
Sujatha vs Nagaraj
TG Crime : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. కానిస్టేబుల్ వేధింపులకు వివాహిత బలైంది. బత్తుల త్రివేణి అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌కు చెందిన బత్తుల వీరయ్యకు అదే జిల్లా పాల్వంచ పట్టణం వికలాంగుల కాలనీకి చెందిన త్రివేణితో వివాహమైంది. కాగా త్రివేణిని కొంతకాలంగా ఖమ్మం జిల్లా చింతకాని మండలం నామవరం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ బత్తుల నాగరాజు మానిసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. నాగరాజు వీరయ్యకు దగ్గరి బంధువు అవుతాడని తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: విజయనగరంలో టెర్రరిస్టుల కలకలం.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు
ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండ బెటాలియన్‌లో నాగరాజు విధులు నిర్వహిస్తున్నాడు. కాగా నాగరాజు కొంతకాలంగా త్రివేణి భర్తకు త్రివేణి అసభ్య పోటోలతో పాటు అసభ్యకర సందేశాలను వాట్సాప్ లో పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా నీపెళ్లాన్ని ఎందుకు ఉంచుకుంటున్నావురా.. నీపెళ్లం సరైంది కాదురా, పనికిమాలింది అంటూ సందేశాలు పంపినట్లు ఆరోపణలు. ఈ క్రమంలో త్రివేణికి ఆమె భర్తకు మధ్య కలహాలు చోటు చేసుకున్నాయి. కానిస్టేబుల్ నాగరాజు వేధింపులు తాళలేక త్రివేణి ఇటీవల పాల్వంచ పట్టణం వికలాంగుల కాలనీలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది.
ఇది కూడా చూడండి: Venkatesh - Trivikram: ఆ స్టార్ హీరోతో త్రివిక్రమ్ భారీ మల్టీస్టారర్..?
త్రివేణి ఫోటోలను, అసభ్యకర సందేశాలను భర్తకే పంపడంతో తీవ్ర మనోవేదనకు గురైన త్రివేణి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కుటుంబసభ్యులు పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే త్రివేణి మృతిచెందినట్లు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. కానిస్టేబుల్ బత్తుల నాగరాజు వేధింపులు తాళలేకే తన కుమార్తె ఆత్మహత్యకు చేసుకుందని మృతిరాలి తండ్రి శివ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానిస్టేబుల్ బత్తుల నాగరాజుపై కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చూడండి: Venkatesh - Trivikram: ఆ స్టార్ హీరోతో త్రివిక్రమ్ భారీ మల్టీస్టారర్..?