/rtv/media/media_files/2025/03/04/hSWHYZRhXCDPZbj3J0ok.jpg)
Ranya Rao
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ యాక్టర్ రన్యారావుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమెతోపాటు తరుణ్ రాజ్ కొండూరుకు బెంగళూరు కోర్టు మంగళవారం బెయిల్ ఇచ్చింది. రూ.2లక్షల చొప్పున వ్యక్తిగత బాండ్, ఇద్దరి పూచీకత్తుతో ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ఇద్దరికి కడీషనల్ బెయిల్‌ను మంజూరు చేసింది. అధికారులు పిలిస్తే తప్పనిసరిగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించొద్దని నిందితులను హెచ్చరించింది. దర్యాప్తు అధికారులకు సహకరించాలని, కోర్టు నుంచి ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని షరతులు పెట్టింది. భవిష్యత్‌లో ఇదే తరహాలో నేరాల్లో పాల్గొనొద్దని ఆదేశించింది.
Also read: BIG BREAKING: పాక్ ఆర్మీ చీఫ్‌కు ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ ప్రమోషన్.. సోషల్ మీడియాలో జోకులు
A special court trying economic offences in Karnataka on 20th May granted default bail to Kannada actress Ranya Rao and Telugu actor/ businessman Tarun Konduru Raju in the gold smuggling case filed against them in March this year.
— Bar and Bench (@barandbench) May 20, 2025
Despite the grant of default bail, Rao will… pic.twitter.com/4DMkxxvNhL
Also read: KCRతో హరీష్ రావు ఆసక్తికర భేటీ.. అరగంటపాటు చర్చలు
కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దవుతుందని హెచ్చరించింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ 60 రోజుల్లోగా చార్జిషీట్‌ని దాఖలు చేయలేకపోయారు. దీంతో రన్యారావు, తరుణ్ రాజ్ లు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. కన్నడ హీరోయిన్ రన్యారావును మార్చి 3న బంగారం స్మగ్లింగ్ కేసులో డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు. విమానాశ్రయంలో ఆమెను అదుపులోకి తీసుకొని రూ.12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో తరుణ్ రాజ్, సాహిల్ సకారియా జైన్‌లను అరెస్టు చేశారు. ప్రస్తుతం ముగ్గురు బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర జైలులో ఉన్నారు.
( Kannada Heroine | heroine Ranya Rao | Ranya Rao case | gold-smuggling | latest-telugu-news)