/rtv/media/media_files/2025/05/20/l37jHw8LQzehzk81aGSa.jpg)
Gaza’s children
United Nations : గాజాలో ఇజ్రాయెల్ దాడులు సాగుతూనే ఉన్నాయి. అక్కడ వేలాదిమంది తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా అభంశుభం తెలియని వేలాదిమంది పసివాళ్లు ఈ యుద్ధంలో మరణిస్తున్నారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. యుద్ధంతో పాటు అక్కడి పిల్లలకు ఆహారం దొరకక పోవడం వల్ల అనేకవేలమంది శిశువులు చనిపోతున్నారని తెలిపింది. మరో 48 గంటల్లో వారికి ఆహారం అందకపోతే 14 వేలమంది పసివాళ్లు మరణించే అవకాశం ఉందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది.
Also Read: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణులు - టాప్ 5 లిస్ట్ ఇదే!
గడచిన11 వారాలుగా ఇజ్రాయెల్ నిర్భంధంలో ఉన్న పాలస్తీనా భూభాగంలోకి పరిమిత సహాయాన్ని మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో పిల్లలకు ఆహారం అందడం లేదు.ఇదే విషయమై యూఎన్ హ్యూమానిటేరియన్ చీఫ్ టామ్ ఫ్లెచర్ మాట్లాడుతూ.. సోమవారం నాడు కేవలం ఐదు ట్రక్కులు సహాయ సామాగ్రి, శిశువుల కోసం ఆహారంతో సహా గాజాలోకి ప్రవేశించాయి కానీ.. అది చాలా చిన్నమొత్తమని, అక్కడ అవసరమైన సమాజాలకు ఆహరం చేరడం లేదని ఆయన వెల్లడించారు.మేము వారికి సహాయం చేయకపోతే పోషకాహార లోపంతో బాధపడుతున్న తల్లులు వారి పిల్లలకు ఆహారం ఇవ్వలేరు. అలా జరిగితే రాబోయే 48 గంటల్లో 14,000 శిశువులు మరణిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది కూడా చూడండి: విజయనగరంలో టెర్రరిస్టుల కలకలం.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు
కాగా పాలస్తీనాలోని సామాన్య ప్రజలకు, పిల్లలకు యూఎన్ మానవతా సహాయం అందకుండా ఇజ్రాయెల్ అడ్డుకోవడాన్ని బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా ఖండించాయి. ఇజ్రాయెల్ తన చర్యలను ఆపకపోతే ఆపకపోతే ఉమ్మడి చర్య తీసుకుంటామని హెచ్చరించాయి. ఇజ్రాయెల్ సహాయాన్ని అడ్డుకోవడం, నెతన్యాహు ప్రభుత్వంలోని మంత్రులు పాలస్తీనియన్ల పట్ల బెదిరింపు వ్యాఖ్యలు చేయడాన్ని ఆయా దేశాల నాయకులు ఖండించారు. కాగా ఈ సందర్భంగా వారి చర్యను సమర్థిస్తూ ఈ రోజు మరో 100 ట్రక్కుల సహాయం, శిశు ఆహారం, పోషకాహారంతో గాజాలోకి చేరాలని యూఎన్ ప్రయత్నిస్తుందని తెలిపారు. రానున్న 48 గంటల్లో వీలైనంతమంది శిశువుల్ని రక్షించేందుకు ప్రయత్నిస్తామని ప్లెచర్ స్సష్టం చేశారు.
ఇది కూడా చూడండి: Venkatesh - Trivikram: ఆ స్టార్ హీరోతో త్రివిక్రమ్ భారీ మల్టీస్టారర్..?