Hijras : రైల్లో రెచ్చిపోయిన హిజ్రాలు..రూ. 10 వేలు లాక్కొని పరార్!

రైల్లో  హిజ్రాలు రెచ్చిపోయారు. ఓ ప్రయాణికుడి నుంచి ఏకంగా రూ. 10వేలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న రైలులో సదురు ప్రయాణికుడి వద్ద డబ్బులు డిమాండ్ చేసిన వాళ్లు ఆపై అతని వద్ద పర్సు లాక్కున్నారు.  

New Update
hijra warangal

రైల్లో  హిజ్రాలు రెచ్చిపోయారు. ఓ ప్రయాణికుడి నుంచి ఏకంగా రూ. 10వేలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న రైలులో సదురు ప్రయాణికుడి వద్ద డబ్బులు డిమాండ్ చేసిన వాళ్లు ఆపై అతని వద్ద పర్సు లాక్కున్నారు.  అందులోని రూ.10 వేలు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు.  ఏంటీ దౌర్జన్యం అని ప్రశ్నిస్తే తోసేసి పరారయ్యారు.

Also Read: కళ్ళు చెదిరే బుకింగ్స్.. వండర్స్ క్రియేట్ చేస్తున్న 'విండ్సర్ ప్రో' బ్రాండ్ న్యూ కార్..

నలుగురు హిజ్రాలు అరెస్ట్

బాధితుడి ఫిర్యాదు మేరకు సికింద్రాబాద్ పోలీసులు నలుగురు హిజ్రాలను అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరికి చెందిన సూర్య భాను ప్రకాష్, జనగామకు చెందిన విజయ్, భద్రాద్రి కొత్తగూడెంకు జిల్లాలకు చెందిన సాయికుమార్‌తో పాటు మరో మైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా పది నెలల క్రితం సూరారంలో రహదారులపై భిక్షాటన చేసే వారని పోలీసులు తెలిపారు. కొంతకాలంగా రైళ్లలో బలవంతంగా హిజ్రాలు ఇలా డబ్బులు లాక్కుంటున్నారని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే  కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే పోలీసులు హెచ్చరించారు.  

Also Read: రూ.20 వేలలోపు ఇంతకన్నా మంచి ఫోన్లు చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ రా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు