/rtv/media/media_files/2025/05/20/PIi5AoADGlYsQII0Coep.jpg)
Kerala student Rejaz
India-Pakistan War : పహల్గాం దాడి, అపరేషన్ సిందూర్ సమయంలో పలువురు పాక్‌కు గూఢచర్యం చేసినట్లు భద్రతా దళాలు గుర్తించాయి. వారికి పలు ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నట్లు తేల్చాయి. ఈ క్రమంలోనే ఆపరేషన్ సిందూర్‌ను, కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు చేసిన కేరళకు చెందిన విద్యార్థి కార్యకర్త రెజాజ్ ఎం షీబా సిద్ధిఖ్‌ను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. కాగా రెజాజ్‌ను విచారించిన మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ రెజాజ్‌కు పలు ఉగ్రసంస్థలలో సభ్వత్యం ఉందని గుర్తించాయి.
Also Read: 'శుభం' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సమంత.. చీర లుక్ అదిరింది! (ఫోటోలు)
రెజాజ్‌కు నిషేధిత డార్క్ బెబ్ సైట్లలో పలు అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు. ఆయా డార్క్ వెబ్ సైట్లలో యాక్టివ్‌గా ఉండడంతో పాటు దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంతో పాటు వ్యతిరేకంగా పెట్టే వారిని అనుచరిస్తూ , ఆ పోస్టలను లైక్ చేస్తూ వారికి మద్దతు పలుకుతున్నట్లు గుర్తించారు. కాగా ఈ డార్క్ వెబ్ సైట్లలో ఉండే కంటెంట్‌ను ఎన్ క్రిప్ట్ చేస్తారు. దానివల్ల వాటిని తెలుసుకోవడం చాలా కష్టం. డ్రగ్స్, ఆయుధాల వంటి అక్రమ వ్యాపారాలు చేసేవారు, ఉగ్రవాదులు తమ గురించి ఎవరికీ తెలియకుండా ఉండటం కోసం వీటిని వినియోగిస్తారు. దీనికోసం ప్రత్యేక బౌజర్లు వినియోగించాల్సి ఉంటుంది. అలాంటి చాలా డార్క్ వెబ్ సైట్లలో రెజాజ్ యాక్టివ్‌గా ఉన్నాడని మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ గుర్తించింది.అంతేకాక రెజాజ్ పాకిస్థాన్‌కు చెందిన పలు ఉగ్ర సంస్థలలో సభ్యత్వం కూడా తీసుకున్నాడని తెలుస్తోంది.
Also Read: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణులు - టాప్ 5 లిస్ట్ ఇదే!
కాగా రెజాజ్‌నాగ్‌పుర్‌లోని ఒక రైఫిల్ దుకాణాన్ని సందర్శించి.. తుపాకీ పట్టుకొని తీసుకున్న పోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే అతనిమీద అనుమానం వచ్చిన కొంతమంది ఇచ్చిన సమాచారంతో అదుపులోకి తీసుకోవడంతో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. అతడికి ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే విషయాలు తెలుసుకోవడానికి సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేస్తున్నామని దర్యాప్తు అధికారులు తెలిపారు. అతడి వద్ద ఉన్న డిజిటల్ పరికరాలను సైబర్-ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపి వాటి నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.