/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
తెలంగాణలోని హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. డీసీఎం వ్యాన్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లో మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ లో రాహుల్ గాంధీ ట్రెండింగ్..వాడేసుకుంటున్న మీడియా..
ఇదిలా ఉండగా ఇటీవల తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో నలుగురు మృతి చెందగా 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వీరంతా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్వెళ్లి గ్రామానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు.
ఇది కూడా చూడండి: విజయనగరంలో టెర్రరిస్టుల కలకలం.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు
విందుకు వెళ్లి తిరిగి వస్తుండగా..
పరిగిలో జరిగిన ఓ విందుకు పలువురు టూరిస్టు బస్సులో వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బీజాపూర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీ ఆగి ఉండగా.. దాన్ని బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు చికిత్స తీసుకుంటుండగా మృతి చెందారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చూడండి: Tapan Deka: ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పదవీ కాలం పొడిగింపు...మరో ఏడాది వరకు
ఇది కూడా చూడండి: Elon Musk: ట్రంప్‌కి బిగ్ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ‘అందులో ఖర్చు తగ్గిస్తాను’