/rtv/media/media_files/2025/05/20/FyWu8r9xRH7Bz5585zvz.jpg)
Women arrested for cheating under married name
TG Crime: ఈ మధ్యకాలంలో మ్యారేజ్ బ్యూరోల పేరుతో మోసం చేసే గ్యాంగ్‌లు ఎక్కువయ్యాయి. అన్ని వయస్సుల వారికి పెళ్లిళ్లు చేస్తామని నమ్మించి అందినకాడికి దండుకొని మోసం చేస్తున్నారు. తాజాగా ఓ వృద్దుడికి పెళ్లి చేస్తామని నమ్మించి లక్షలు వసూలు చేసి పారి పోయిన కీలేడీల విషయం వెలుగు చూసింది.
ఇది కూడా చూడండి: Health Risks of Ivy Gourd Curry: లొట్టలేసుకుంటూ దొండకాయ కర్రీ లాగించేస్తున్నావా..? బీ కేర్‌ఫుల్ బ్రో..
చాలామంది సంపన్నులైన వృద్దులు, రిటైర్ ఉద్యోగులు తమ తోడు కోల్పొయి ఒంటరిగా జీవిస్తున్నారు. వారి పిల్లలు ఉన్నా వారంతా విదేశాల్లో సెటిల్ అవ్వడంతో ఒంటరిగా జీవిస్తున్నారు. అయితే తమ జీవిత చరామంకంలో తోడు కోరుకుంటున్నారు. అలా వివిధ మ్యాట్రీమోని సైట్లలో తమ తోడుకోసం వెతుకుతున్నారు. రెండో పెళ్లి కోసమని ప్రయత్నిస్తున్నారు. అలాంటి వృద్ధులను టార్గెట్ చేసుకుని కొంతమంది కీలాడీలు తమ ప్లాన్ అమలు చేశారు.
ఇది కూడా చూడండి: Windsor Pro electric SUV: కళ్ళు చెదిరే బుకింగ్స్.. వండర్స్ క్రియేట్ చేస్తున్న 'విండ్సర్ ప్రో' బ్రాండ్ న్యూ కార్..
కాగా రెండో పెళ్లి కోసం వెతుకుతున్న ఓవృద్దుడిని లైన్లో పెట్టారు ఇద్దరు మాయ లేడీలు. హైదరాబాద్‌కు చెందిన ఓ ఇద్దరు మహిళలు ఓ ఫేక్ మ్యారేజ్ బ్యూరోను ఏర్పాటు చేశారు. ముసలి వాళ్లకు పెళ్లిళ్లు చేస్తామంటూ ప్రచారం చేశారు. సంపన్నులు, రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగులను టార్గెట్ చేసుకుని తమ ప్లాన్ అమలు చేశారు. ఓ వృద్ధుడు వీరి ఉచ్చులో చిక్కుకున్నాడు. అతడికి గుర్తు తెలియని మహిళతో పెళ్లి నిశ్చయం చేశారు. పెళ్లి షాపింగ్ పేరుతో రెండు లక్షల రూపాయలు కాజేశారు.
ఇది కూడా చూడండి: Health Risks of Ivy Gourd Curry: లొట్టలేసుకుంటూ దొండకాయ కర్రీ లాగించేస్తున్నావా..? బీ కేర్‌ఫుల్ బ్రో..
అంతా ముగిసింది ఇక పెళ్లే తరువాయి అని ఎదురు చూస్తున్న తాతకు ఆ మహిళలు షాక్ ఇచ్చారు.పెళ్లి బట్టలతో ఎదురు చూస్తున్న వృద్దుడికి మహిళలు ముఖం చాటేశారు. సమయం గడచిన వారు రాకపోవడంతో అనుమానం వచ్చిన వృద్దుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆ పెద్దాయన మహాంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మ్యారేజీ బ్యూరో పేరుతో వృద్దుడిని మోసం చేసిన ఆ ఇద్దరు మాయలేడీలను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Venkatesh - Trivikram: ఆ స్టార్ హీరోతో త్రివిక్రమ్ భారీ మల్టీస్టారర్..?