/rtv/media/media_files/2025/05/21/PvX3pPcHETt4oIjs821V.jpg)
పెళ్లికి వెళ్లినప్పుడు ఏడు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురికావడంతో మనస్తాపం చెందిన ఓ వివాహిత తన రెండున్నరేళ్ల కొడుకుతో కలిసి తన ఇంటి మూడో అంతస్తు నుంచి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వనస్థలిపురంలో చోటుచేసుకుంది. వనస్థలిపురం పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం.. చింతల్‌కుంటకు చెందిన సుధేష్ణ (28)కు నాలుగేళ్ల కిందట అమ్మదయ కాలనీకి చెందిన నోముల ఆశీష్ కుమార్‌తో వివాహం జరిగింది. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు ఆరుష్‌కుమార్ ఉన్నాడు. అయితే 2025 మే 16న సుధేష్ణ నాచారంలో జరిగిన తన బంధువుల పెళ్లికి వెళ్లింది.
మూడో అంతస్తు నుంచి కుమారుడితో
అయితే అక్కడ తన ఏడు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. అవి దొరక్కపోవడంతో సుధేష్ణ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇక అవి దొరకవనే మనస్తాపంతో మంగళవారం ఆగమయ్య నగర్‌లోని తన నివాసంలో మూడో అంతస్తు నుంచి కుమారుడితో పాటు కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. బాబు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.