Tirupathi Fire Accident: తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. భయంతో భక్తులు పరుగో పరుగు

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆలయం ముందు ఉన్న చలువ పందిళ్లకు మంటలు అంటుకున్నాయి. భారీగా పొగ, మంటలు వ్యాపించడంతో భక్తులు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది.

New Update
Fire Accident in Hyderabad

Tirupathi Fire Accident

తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆలయం ముందు భాగంలో ఉన్న షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆలయం ముందు ఉన్న చలువ పందిళ్లకు మంటలు అంటుకోవడంతో భారీగా పొగ, మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో సమీపంలో ఉన్నవారు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. 

Also Read : సికింద్రాబాద్ లో బాలిక అదృశ్యం..అల్ఫాహోటల్‌ వైపు వెళ్లి.....

Tirupathi Fire Accident

భారీ మంటలను చూసి స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసింది. దీంతో భారీ ముప్పు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. కానీ షాపులో ఉన్న ఇత్తడి సామాను, బొమ్మలు దగ్దం అయ్యాయి. 

Also Read : మోదీకి ట్రంప్ వార్నింగ్.. రష్యాతో వ్యాపారం చేస్తే 500% టారిఫ్!

ఇలాంటిదే HYDలో మరొక ఘటన

హైదరాబాద్ లో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కాటేదాన్ తిరుపతి రబ్బర్ ఫ్యాక్టరీలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు అంటుకున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురై వెంటనే ఫైర్ ఇంజన్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా మంటలను అదుపులోకి తెస్తున్నారు. మరింత సమచారం తెలియాల్సివుంది. 

Also Read : మనల్ని ఎవడ్రా ఆపేది.. మోటో నుంచి సూపర్ డూపర్ స్మార్ట్‌ఫోన్ - ఖతర్నాక్ ఫీచర్స్!

Advertisment
Advertisment
తాజా కథనాలు