/rtv/media/media_files/2025/07/03/hyd-fire-accident-2025-07-03-07-44-51.jpg)
HYD Fire Accident
తెలంగాణలోని పాశమైలారం ఘటన మరువకముందే మరో ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇవాళ అంటే గురువారం తెల్లవారుజామున కాటేదాన్‌లోని శివం రబ్బర్ ఫ్యాక్టరీలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి.
Also Read : సికింద్రాబాద్ లో బాలిక అదృశ్యం..అల్ఫాహోటల్ వైపు వెళ్లి.....
HYDలో అగ్ని ప్రమాదం
దీంతో స్థానికులు భయాందోళనకు గురై వెంటనే బయటకు పరుగులు తీశారు. అనంతరం స్థానికులు భయాందోళనకు గురై వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది నాలుగు ఫైర్ యంత్రాలతో మంటలను అదుపు చేశాయి. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇంకా తెలియరాలేదు.
Also Read : మోదీకి ట్రంప్ వార్నింగ్.. రష్యాతో వ్యాపారం చేస్తే 500% టారిఫ్!
ఇలాంటిదే ఏపీలో మరో ప్రమాదం
ఏపీలోని తిరుపతిలో గోవిందరాజ స్వామి ఆలయ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆలయం ముందు భాగంలో ఉన్న షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆలయం ముందు ఉన్న చలువ పందిళ్లకు మంటలు అంటుకోవడంతో భారీగా పొగ, మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో సమీపంలో ఉన్నవారు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.
Also Read : సికింద్రాబాద్ లో బాలిక అదృశ్యం..అల్ఫాహోటల్ వైపు వెళ్లి.....
Tirupathi Fire Accident
భారీ మంటలను చూసి స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే మూడు ఫైర్ యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసింది. దీంతో భారీ ముప్పు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. కానీ ఈ అగ్నిప్రమాదానికి రెండు షాపుల్లో ఉన్న ఇత్తడి సామాను, బొమ్మలు దగ్దం అయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది
Also Read : మనల్ని ఎవడ్రా ఆపేది.. మోటో నుంచి సూపర్ డూపర్ స్మార్ట్‌ఫోన్ - ఖతర్నాక్ ఫీచర్స్!
hyd-fire-accident