HYD Crime: HYDలో గుండె పగిలే విషాదం.. కాలికి సర్జరీ.. గుండెపోటుతో బాలుడు మృతి
హైదరాబాద్లో గుండెపగిలే విషాదం చోటుచేసుకుంది. కాలుకు సర్జరీ చేస్తే గుండెపోటుతో బాలుడు మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని టిఎక్స్ ఆస్పత్రిలో జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కుమారుడు మృతి చెందాడని బాలుడి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.