Crime: ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు.. మరిదిలతో అక్రమ సంబంధం

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ మహిళా ఆస్తి కోసం తన అత్తనే హత్య చేసింది. ఆ తర్వాత ఇంట్లో నుంచి నగలు ఎత్తుకెళ్లింది. చివరికి ఈ హత్యకు సహకరించిన ఆమె చెల్లిని పోలీసులు అరెస్టు చేశారు.

New Update
Woman kills mother-in-law over land dispute, had affairs with husband's 2 brothers

Woman kills mother-in-law over land dispute, had affairs with husband's 2 brothers

ప్రస్తుత కాలంలో ఆస్తుల కోసం కుటుంబాలు విడిపోతున్నాయి. మరికొందరైతే హత్యలు కూడా చేసేందుకు వెనకాడటం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ మహిళా ఆస్తి కోసం తన అత్తనే హత్య చేసింది. ఆ తర్వాత ఇంట్లో నుంచి నగలు ఎత్తుకెళ్లింది. చివరికి ఈ హత్యకు సహకరించిన ఆమె చెల్లిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఝాన్సీ జిల్లాలోని సుశీలా దేవి, అజయ్ దంపతులు ఉంటున్నారు. వీళ్లకు ముగ్గురు కొడుకులు కాగా.. ఒకరు మృతి చెందారు. మృతిచెందిన వ్యక్తి సతిమణి పేరు పూజ.

Also read: దారుణం.. స్విమ్మింగ్ పూల్‌లో పడి డెలివరీ బాయ్ మృతి.. 22వ అంతస్తులో ఫుడ్ ఇవ్వడానికి వెళ్లి!

Woman Kills Mother In Law

ఈ కుటుంబానికి మొత్తం 16 ఎకరాల భూమి ఉంది. భర్త మృతి తర్వాత పూజ తన మరిదిలైన సంతోష్, కళ్యాణ్ సింగ్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది.  అయితే పూజ 8 ఎకరాల భూమిని అమ్మేసి మధ్యప్రదేశ్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంది.  ఆమె మామ అజయ్, మరిది సంతోష్ దీనికి ఒప్పుకున్నారు. కానీ అత్త సుశీలా దేవి మాత్రం ఇందుకు అంగీకరించలేదు. దీంతో పూజా.. తన చెల్లి కమల, ఆమె ప్రియుడు అనిల్‌తో కలిసి అత్త సుశీలా దేవీని హత్య చేయాలని, 8 లక్షల విలువైన నగలు కాజేయాలని ప్లాన్ వేశారు. 

Also read: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. రబ్బర్ ఫ్యాక్టరీలో ఎగసిపడిన మంటలు

చివరికీ జూన్‌ 24న సుశీలా దేవి విగతజీవిగా పడిఉంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పూజా, ఆమె చెల్లి కమలను అరెస్టు చేశారు. అనిల్‌ వర్మ నగలు అమ్మేందుకు తన బంధువు ఇంటికి వెళ్తుండగా పోలీసులు అతడిని అడ్డుకున్నారు. దీంతో వారిపై కాల్పులు జరపగా.. పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. దీంతో అనిల్‌ ఈ కాల్పుల్లో మృతి చెందాడు. పోలీసు విచారణలో పూజా నేరాన్ని అంగీకరించింది. తాన, తన చెల్లి కమల, ఆమె ప్రియుడు అనిల్‌ కలిసి హత్యకు ప్లాన్ చేసినట్లు చెప్పింది. పోలీసులు వాళ్లు అపహరించిన నగలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. 

Also Read :  తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఫిల్మ్‌నగర్‌ ఎస్సై స్పాట్ డెడ్

Also Read :  బోటు బోల్తా.. నలుగురు మృతి - 61 మంది గల్లంతు

national-news | rtv-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు