MI VS SRH : హైదరాబాద్ ను ఓడించిన ముంబై నాలుగు వికెట్ల తేడాతో..

ఈ రోజు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఎమ్ఐ వియం సాధించింది. ఎస్ఆర్హెచ్ ఇచ్చిన 162 పరుగుల టార్గెట్ ను ముంబై ఇండియన్స్ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు మిగిలిండగానే ఛేదించి గెలుపును సొంతం చేసుకుంది.

author-image
By Manogna alamuru
New Update
ipl-2025 mi vs srh

ipl-2025 mi vs srh

ముంబై, హైదరాబాద్ మధ్య మ్యాచ్ అంటే అద్భుతాలు జరుగుతాయని అందరూ అనుకున్నారు. అందులోనూ గత కొన్ని మ్యాచ్ లు ఉత్కంఠతతో నడుస్తాయి. కాబట్టి ఇది కూడా చాలా బావుంటుంది అనుకున్నారు. అయితే అందరూ అనుకున్నట్టు ఏమీ జరగలేదు. ముంబై ఇండియన్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య చాలా సాధారణంగా అయిపోయింది. హైదరాబాద్ ఇచ్చిన 162 టార్గెట్ ను మంబై ఈజీగా ఛేజ్ చేసింది. లాస్ట్ లో ఒక రన్ చేయాల్సి ఉండగా మూడు వికెట్లు పోగొట్టుకుంది ముంబై. కానీ అప్పటికే గెలుపు వారి ఖాతాలో పడిపోయింది. హైదరాబాద్ మరోసారి ఓటమిని మూటగట్టుకుంది. ముంబై జట్టులో ర్యాన్‌ రికెల్టన్‌ (31), విల్‌ జాక్స్‌ (36), రోహిత్‌ శర్మ (26), సుర్యకుమార్‌ యాదవ్‌ (26), హార్దిక్‌ పాండ్య (21) రాణించారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో కమిన్స్‌ 3, ఎషాన్‌ మలింగ 2, హర్షల్‌ పటేల్‌ ఒక వికెట్‌ తీశారు. ముంబయికి ఇది వరుసగా రెండో విజయం.

మళ్ళీ అదే వరస..

ఐపీఎల్ 18లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తడబడింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హైదరాబాద్‌ బ్యాటర్లలో అభిషేక్‌ శర్మ (40), హెన్రిచ్‌ క్లాసెన్‌ (37), ట్రావిస్‌ హెడ్‌ (28) రాణించారు.  టాస్ ఓడిన బ్యాటింగ్ దిగిన సన్‌రైజర్స్ కు ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌(28) , అభిషేక్‌ శర్మ (40) అదిరపోయే ఆరంభాన్ని ఇచ్చారు.  ఇద్దరు కలిసి దూకుడుగా ఆడుతూ జట్టు స్కోరును 8 ఓవర్లలో 65 పరుగులు దాటించారు.  వీరిద్దరి జోడీని కెప్టెన్ హార్దిక్‌ పాండ్య విడదీశాడు.  హార్దిక్‌ బౌలింగ్‌లో రాజ్‌ బావాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరిన అభిషేక్‌ శర్మ వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్‌ కిషన్‌ (2) పరుగులకే క్రీజు నుంచి ముందుకు వచ్చి భారీ షాట్‌కు ప్రయత్నించి రికెల్‌టన్‌ స్టంపింగ్‌ కు దొరికిపోయాడు.

today-latest-news-in-telugu | IPL 2025 | mumbai-indians | hyderabad | sun-risers

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు