/rtv/media/media_files/2025/04/17/k1lrMRKORGCaMQfYC6Tv.jpg)
Gaddar Awards Jury
గద్దర్ అవార్డుల కోసం జ్యూరీ సిద్ధమైంది. ఒక చైర్మన్ 15 మంది సభ్యులతో ఈ జ్యూరీ పనిచేయనుంది. ఇంతకు ముందే జ్యూరీ ఛైర్మన్ గా సీనియర్ నటి జయసుధను ఎంపిక చేయగా...ఈరోజు జ్యూరీ సభ్యులను ఖరారు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 'గద్దర్' అవార్డులను ఇస్తోంది. ఈ అవార్డులను విషయంలో జ్యూరీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు చెప్పారు.
జ్యూరీ సభ్యులు వీరే..
గద్దర్ అవార్డుల కోసం ఏర్పాటైన జ్యూరీలో నటి జీవిత రాజశేఖర్ తో పాటుగా దర్శకులు దశరథ్, వీఎన్ ఆదిత్య, నందిని రెడ్డి, ఎల్. శ్రీనాథ్, శివ నాగేశ్వరరావు, ఉమా మహేశ్వర రావు లకు చోటు కల్పించారు. అలానే లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్, నిర్మాత ఏడిద రాజా, ఎగ్జిబిటర్ విజయ్ కుమార్ రావు, ఫిలిం అనలిస్ట్ గౌతమ్, జర్నలిస్టులు వెంకట రమణ, లక్ష్మీ నారాయణ సభ్యులుగా ఎంపికయ్యారు. అలాగే ఎఫ్డీసీ ఎండీ కూడా ఈ జ్యూరీలో భాగం కానున్నారు.
Also Read: IPL 2025: వేడి పెంచుతున్న ఐపీఎల్..రసవత్తరంగా మ్యాచ్ లు
గద్దర్ అవార్డుల ఎంపిక విషయంలో చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సభ్యులను ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు కోరారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం సినిమా అవార్డులను ఇస్తున్నట్టుగా వారికి గుర్తుచేసిన దిల్ రాజు.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలన చిత్ర అవార్డులకు ఇంతటి స్పందన రాలేదన్నారు. గద్దర్ అవార్డుల కోసం ఇప్పటివరకు 1248 విభాగాల్లో నామినేషన్స్ రాగా.. వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిల్మ్, చిల్డ్రన్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర కేటగిరిల్లో 76 దరఖాస్తులు వచ్చాయి. ఏప్రిల్ 21వ తేదీ నుంచి జ్యూరీ సభ్యులు ఈ అప్లికేషన్లను స్క్రీనింగ్ చేయనున్నారు.
today-latest-news-in-telugu | cinema | Telangana Gaddar Awards
Also Read: TN: వెయ్యి కిలోల ఆలయాల బంగారాన్ని కరిగించిన తమిళనాడు ప్రభుత్వం..ఎందుకో తెలుసా?