/rtv/media/media_files/2025/07/22/gutka-2025-07-22-18-32-13.jpg)
గుట్కాలను అలవాటు చేసుకోకూడదని బతికి ఉండగా నటుడు ఫిష్ వెంకట్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాను రోజుకూ 30 నుంచి 40 గుట్కాలు తీసుకునేవాడినని ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫిష్ వెంకట్ తెలిపారు. పాన్ మసాలాలు వాడటం వలన తనకు మాట కూడా సరిగ్గా వచ్చేది కాదన్నారు. దీనికి కారణం గుట్కాలేనన్నారు. ఓ డాక్టర్ సూచనలతో వాటిని తినడం నెమ్మదిగా తగ్గించేశానన్నారు. మెల్లిమెల్లిగా గుట్కాలు తగ్గించడంతో తాను మళ్లీ మాట్లాడుతున్నానని తెలిపారు. దయచేసి ఎవరు కూడా గుట్కాలను అలవాటు చేసుకోకూడదని ఫిష్ వెంకట్ మెసేజ్ఇచ్చారు. తాను పడిన బాధ ఎవరూ బాధపడకూడదని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read : 'నెక్ట్స్ ఉపరాష్ట్రపతి నితీష్.. సీఎం పదవికి రాజీనామా!'
కిడ్నీ సంబంధిత సమస్యలతో
కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆర్థిక ఇబ్బందులు, సరైన సమయంలో కిడ్నీ దాత దొరకకపోవడం కూడా ఆయన ఆరోగ్యం క్షీణించడానికి కారణమయ్యాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఫిష్ వెంకట్ హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందకు పైగా తెలుగు సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. "ఆది", "దిల్", "బన్ని", "అత్తారింటికి దారేది", "డీజే టిల్లు", "గబ్బర్ సింగ్" వంటి పలు హిట్ సినిమాల్లో ఆయన నటించారు. "ఆది" సినిమాలో "ఒక్కసారి తొడకొట్టు చిన్నా" అనే డైలాగ్ ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
Also Read : Gandikota Girl: తల్లే విలన్!.. గండికోట యువతి హత్య కేసులో షాకింగ్ నిజాలు!
Also Read : UAE : దారుణం.. బర్త్‌డే రోజునే భర్త చంపేశాడు...గొంతుకోసి!
Also Read : POKలో తిరగబడ్డ పోలీసులు.. పాకిస్తాన్ కు ఇది మామూలు దెబ్బ కాదు!
tollywood | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | latest tollywood updates | tollywood-actors