Allu Arjun-Pawan Kalyan: కలిసిపోయిన మామ- అల్లుడు.. వైరలవుతున్న ఫొటోలు
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, చిరంజీవి అత్తగారు అల్లు కనకరత్నమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే నిన్న వైజాగ్ సభలో ఉండడంతో కనకరత్నమ్మ చివరి చూపుకు రాలేకపోయిన పవన్.. ఈరోజు స్వయంగా అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.