Kesari Chapter 2 in Telugu
ఇటీవల బాలీవుడ్‌లో (Bollywood) విడుదలైన హిస్టారికల్ డ్రామా 'ఛావా' (Chhaava) భారీ విజయం సాధించింది. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమాను లక్ష్మణ్ ఉటేకర్ రూపొందించగా, హిందీతో పాటు తెలుగు డబ్బింగ్ వర్షన్‌లో కూడా విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
Also Read: ఇంతకీ 'NTR' ఎవరు..? నాల్గవ తరం వారసుడు పై నెటిజన్ల కామెంట్స్ హల్‌చల్!
'ఛావా' విజయాన్ని కొనసాగిస్తూ, ఇప్పుడు మరో బాలీవుడ్ హిస్టారికల్ హిట్ మూవీ ‘కేసరి చాప్టర్ 2’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అక్షయ్ కుమార్(Akshay Kumar), ఆర్. మాధవన్(R. Madhavan) ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు కరణ్ సింగ్ త్యాగి తెరకెక్కించారు. హిందీలో విడుదలై విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో కూడా విడుదలకు సిద్ధమైంది.
Also Read: BIG BREAKING: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు!
మే 23న ‘కేసరి చాప్టర్ 2’ తెలుగులో
సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో, మే 23న ‘కేసరి చాప్టర్ 2’ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. సైనిక గౌరవం, సైనిక త్యాగం నేపథ్యంగా సాగే ఈ సినిమా, దేశభక్తితో నిండిన కథతో ప్రేక్షకులను ఆకట్టుకునే గా రూపొందించారు.
ఇప్పటికే హిందీలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా తెలుగులో ఎలాంటి స్పందన పొందుతుందనేది ఆసక్తికరంగా మారింది. ‘ఛావా’కి వచ్చిన ఆదరణ ‘కేసరి చాప్టర్ 2’కి కూడా వస్తుందా అన్నది వేచి చూడాలి.
Also Read: 'ఈట్.. స్లీప్.. సలార్'.. బొమ్మ వచ్చి 500 రోజులు దాటినా ఊపు తగ్గలేదుగా!
latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | Kesari Chapter 2 in Telugu | bollywood-news | vikki-kaushal | Rashmika Mandanna