Salaar Netflix Trending: 'ఈట్.. స్లీప్.. సలార్'.. బొమ్మ వచ్చి 500 రోజులు దాటినా ఊపు తగ్గలేదుగా!

ఓటీటీలో బోలెడంత కంటెంట్ ఉన్నా, 'సలార్'కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. విడుదలై 15 నెలలు గడిచినా, నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పటికీ టాప్-10 ట్రెండింగ్‌లో ఉంది. యువత, ముఖ్యంగా అమ్మాయిలు మళ్లీ మళ్లీ చూస్తుండటంతో సలార్ ఈ ట్రెండ్ సెట్ చేసింది.

New Update

Salaar Netflix Trending: 'ఈట్.. స్లీప్..రిపీట్' సోషల్ మీడియాలో “మీ రోజువారీ జీవితంలో ఏమి చేస్తారు?” అనే ప్రశ్నకు చాలామంది సరదాగా ఇచ్చే సమాధానం ఇదే. భాషలు మారినా ఈ ఆన్సర్ మాత్రం మారడం లేదు. తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని ప్రధాన భారతీయ భాషల్లోనూ ‘సలార్’ సినిమా పట్ల అభిమానులు చూపిస్తున్న ప్రేమ కూడా సేమ్ ఇలానే ఉంది.

Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్‌ కూడా మేమే

2023 డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ డ్రామా  ‘సలార్’ సినిమా, విడుదలైనప్పటి నుంచీ హిట్ టాక్‌తో దూసుకెళ్లింది. రెండు నెలల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ రిలీజ్ అయిన తర్వాత, ఈ సినిమాకు వచ్చిన ఆదరణ మరింత పెరిగింది. థియేటర్ హడావుడిని మించి, ఓటిటీలో ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ సూపర్. మరీ ముఖ్యంగా యాక్షన్ సీన్లు, హీరో ఎలివేషన్ సీన్ల కైతే ఫ్యాన్స్ బట్టలు చించేసుకుంటున్నారు. 

Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?

ఓటిటీల్లో బోలెడంత కంటెంట్ అందుబాటులో ఉన్నా కూడా, చాలామంది ప్రేక్షకులు మళ్లీ మళ్లీ ‘సలార్’నే చూస్తున్నారు. ముఖ్యంగా యువత, అమ్మాయిలు కూడా ఈ సినిమాను రిపీట్ మోడ్ లో చూస్తున్నామని తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

నెట్‌ఫ్లిక్స్‌ టాప్-10లో ట్రెండ్

ఒక మూవీ డిజిటల్‌గా విడుదలై 450 రోజులు దాటిన తరువాత కూడా, నెట్‌ఫ్లిక్స్‌ టాప్-10లో ట్రెండ్ అవ్వడం అంటే సాధారణ విషయం కాదు.  దీంతో 'సలార్' సినిమాకు ఉన్న ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా తెలుస్తోంది. సాధారణంగా ఏ పెద్ద హీరో సినిమా అయినా ఓటీటీలో రిలీజ్ అయిన కొన్ని వారాల తర్వాత ట్రెండింగ్‌లోంచి మాయమవుతుంది. కానీ ‘సలార్’ మాత్రం విడుదలై 15 నెలలు దాటినా, మధ్యలో ఎన్నో భారీ సినిమాలు వచ్చినా, ఇప్పటికీ అదే జోష్‌లో కొనసాగుతోంది.

Also Read: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?

అందుకు కారణం ప్రభాస్(Prabhas) అభిమానులే కాదు, ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను ఆదరిస్తున్నారు. అందుకే ఈ సినిమా ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్‌ టాప్-10లో ట్రెండ్ అవుతోంది. ఓటీటీలో యాక్షన్ ఎలివేషన్‌ సినిమాలకు బెస్ట్ ఎక్సంపుల్ 'సలార్' అనే చెప్పవచ్చు!

Advertisment