Cyclone Montha: వాయుగుండంగా బలహీనపడిన మొంథా తుపాను.. తెలంగాణలో భారీ వర్షాలు !
మొంథా తుపాను వాయుగుడంగా బలహీనపడ్డట్లు వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన ఆరు గంటలకు ఇది కేవలం 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం దీని ప్రభావం తెలంగాణలో కొనసాగుతోంది.
మొంథా తుపాను వాయుగుడంగా బలహీనపడ్డట్లు వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన ఆరు గంటలకు ఇది కేవలం 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం దీని ప్రభావం తెలంగాణలో కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుపాను ప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలోని తుపాను ప్రభావిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లతో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొంథా తుఫాను ప్రభావం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తుపాను బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఏపీలో మొంథా తుపాను బీభత్సం సృష్టించడంతో అధికారులు, నాయకులు ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అండగా ఉంటామని, సాయం చేస్తామని భరోసా ఇస్తున్నారు. అయితే ఏపీలో పలుచోట్ల చెట్లు రోడ్డుపై పడిపోవడంతో వాటిని అధికారులు తొలగించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీ ప్రజలకు కీలక సూచనలు చేసింది. గోరువెచ్చని నీటిని మాత్రమే తీసుకోవాలని తెలిపింది. అధికారిక ప్రకటన వచ్చే వరకు బయటకు వెళ్లవద్దని సూచించింది.
తుపానుకు ముందు, తుపాను సమయంలో, తుపాను తర్వాత అధికారులు తీసుకోవాల్సిన కీలక జాగ్రత్తలు తెలుపుస్తున్నారు. తుపాను తీరం దాటుతున్న సమయంలో ప్రజలు ఇంట్లోనే ఉండటం ఉత్తమం. ఆరోగ్య, భద్రతా కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
తుఫాన్లకు పేర్లు పెట్టడం ప్రజలకు ప్రమాద హెచ్చరిక ఇచ్చేందుకు, తుఫాన్లను సులభంగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఆరు ప్రధాన వాతావరణ కేంద్రాలు, ఐదు ప్రాంతీయ కేంద్రాలు పేర్లను నిర్ణయిస్తాయి. దీని కోసం స్థానిక భాషల, సంప్రదాయాల పేర్లు ఉపయోగిస్తారు.
మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ రాత్రి నుంచి కురుస్తున్న వానతో తడచిముద్దయింది. హైదరాబాద్ వాసులు ఈ ఉదయం భారీ వర్షంతోనే నిద్రలేచారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచే వర్షం కురుస్తుండగా, తెల్లవారుజాము నుంచి కుండపోతగా మారింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. కోస్తా జిల్లాల్లో మొంథా తుఫాన్ ప్రభావం అధికంగా ఉంది. కొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి తుపాన్ బలహీనపడనుంది. అర్ధరాత్రి తీరం దాటిన తుఫాన్ తెలుగు రాష్ట్రాలపై విరుచుకుపడుతుంది.