Cyber Crime: అమెజాన్‌లో ఆర్డర్.. రూ.లక్ష మోసపోయిన వృద్ధురాలు
అమెజాన్‌లో కొన్న వస్తువును తిరిగి అప్పగించేందుకు యత్నించిన ఓ వృద్ధురాలు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. ఆమె నుంచి వాళ్లు ఏకంగా రూ.1.07 లక్షలు కాజేశారు.
అమెజాన్‌లో కొన్న వస్తువును తిరిగి అప్పగించేందుకు యత్నించిన ఓ వృద్ధురాలు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. ఆమె నుంచి వాళ్లు ఏకంగా రూ.1.07 లక్షలు కాజేశారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమం జరుగుతోంది. బోనాల జాతరలో రెండోరోజు జరిగే ఈ కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
రన్నింగ్ బైక్‌పై రొమాన్స్ చేస్తూ ప్రమాదకరంగా ప్రయాణించారు. అది మరో బైక్‌పై ప్రయాణిస్తున్న వారి వీడియో తీశారు. వీడియోలో యువతి, బైక్ నడుపుతున్న వ్యక్తిని కౌగిలించుకొని కూర్చింది. ఆరాంఘర్ ఫ్లై ఓవర్ మీద ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.
MLC తీన్మార్ మల్లన్న, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవితపై కేసు నమోదైంది. ఇటీవల ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు.
తీన్మార్ మల్లన్న జాగృతి నాయకురాలు కవితపై చేసిన వ్యాఖ్యల పట్ల BRS ఫస్ట్ టైం స్పందించింది. ఆపార్టీ MLC కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించింది. ఈమేరకు ఆ పార్టీ అధికారిక X అకౌంట్లో శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పోస్ట్ చేశారు.
హైదరాబాద్‌లో ఓ సంచలన విషయం బయటపడింది. ‘భాయ్ బచ్చా ఆగయా భాయ్’ అనే వాట్సప్ కోడ్‌తో గంజాయిని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. 14 మందిని అదుపులోకి తీసుకోని డీఅడిక్షన్ సెంటర్లకు తరలించారు.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కవితకు మద్దతు ఇస్తున్నట్లు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు.
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి వల్ల తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు కూడా వీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆదివారం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్సీ కవిత వెళ్లి తీన్మార్ మల్లన్న పై ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.