ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జాగృతి నాయకురాలు కవితపై చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ టైం స్పందించింది. బీఆర్ఎస్ MLC కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆ పార్టీ ఖండించింది. ఈమేరకు ఆ పార్టీ అధికారిక X అకౌంట్‌లో శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పోస్ట్ చేశారు. మహిళల గౌరవాన్ని కాపాడటం మన సంస్కృతి. వ్యక్తిగత దూషణలు, మహిళలను కించపరిచే వ్యాఖ్యలకు రాజకీయాల్లో చోటు లేదని అందులో పేర్కొన్నారు. గతకొంత కాలంగా కవిత బీఆర్ఎస్ పార్టీలో యాక్టీవ్‌గా ఉండని విషయం తెలిసిందే. ఆ పార్టీ అధినేత కేసీఆర్, ఆమె తండ్రికి రాసిన లేఖ నుంచి పార్టీతో ఆమెకు దూరం పెరింగింది. తెలంగాణ జాగృతి తరుపున కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తోంది. దీంతో ఆమె కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతుందని కూడా వార్తలు వచ్చాయి. ఈక్రమంలో బీఆర్ఎస్ మొదటి సారి అధికారికంగా ఆమె విషయంలో ఇప్పుడే స్పందించింది.
తీన్మార్ మల్లన్నకు వార్నింగ్
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మాట్లాడే భాష మహిళలను కించపరిచేలా ఉండడం తగదని బీఆర్‌ఎస్ పార్టీ లీడర్ అన్నారు.. ఆడబిడ్డల గురించి మాట్లాడేటప్పుడు సోయితో మాట్లాడితే మంచిదని సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు. తీన్మార్ మల్లన్న వెంటనే ఎమ్మెల్సీ కవితకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మల్లన్నకు బీఆర్ఎస్ వార్నింగ్.. కవిత ఇష్యూపై ఫస్ట్ రియాక్షన్!
తీన్మార్ మల్లన్న జాగృతి నాయకురాలు కవితపై చేసిన వ్యాఖ్యల పట్ల BRS ఫస్ట్ టైం స్పందించింది. ఆపార్టీ MLC కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించింది. ఈమేరకు ఆ పార్టీ అధికారిక X అకౌంట్‌లో శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పోస్ట్ చేశారు.