BIG BREAKING: శాసన మండలి ఛైర్మన్‌తో MLC కవిత కీలక భేటీ..!

తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆదివారం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్సీ కవిత వెళ్లి తీన్మార్ మల్లన్న పై ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

New Update
KAVITHA

తీన్మార్ మల్లన్నకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాస్ వార్నింగ్ ఇచ్చారు. నా వెనుక లక్షలాది మంది ఆడబిడ్డలు ఉన్నారని ఆమె అన్నారు. ఎమ్మెల్సీ పదవి నుంచి మల్లన్నను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆడవారు రాజకీయాల్లో మాట్లాడకూడదా కవిత ప్రశ్నించారు. మల్లన్నకు నాపై కోపమెందుకని అడిగారు. జాగృతి కార్యకర్తలు మల్లన్నతో మాట్లాడటానికి వెళ్లారు. నిరసన తెలిపితే కాల్చేస్తారా అని ఆమె మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై నేను మాట్లాడకూడదా అని ఆమె అన్నారు. ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇప్పటికే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌ను కలిసి తీన్మార్ మల్లన్న మాటలపై ఫిర్యాదు చేశానన్నారు ఎమ్మెల్సీ కవిత. 

తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆదివారం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్సీ కవిత వెళ్లి తీన్మార్ మల్లన్న పై ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

బీసీ రిజర్వేషన్‌తో కవిత సంబరాలు చేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. బీసీలతో కవితకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఈక్రమంలో తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యల చేశారు. దీంతో ఈరోజు ఉదయం జాగృతి కార్యకర్తలు క్యూ న్యూస్ ఆఫీస్‌పై దాడి చేశారు. మల్లన్న మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు శాసన మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు. 

తీన్మార్ ఆఫీస్‌పై దాడి

ఈక్రమంలోనే మల్లన్న వాఖ్యలపై డీజీపీని కలిసి కవిత ఫిర్యాదు చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కాగా, జాగృతి కార్యకర్తల దాడి సమయంలో తీన్మార్ మల్లన్న గన్‌మెన్ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే ఓ జాగృతి కార్యకర్తకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. నేరుగా గన్ మెన్ తుపాకీతో కార్యకర్తలపై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

latest-telugu-news | mlc kavitha | gutha-sukender-reddy | Teenmar mallanna

Advertisment
Advertisment
తాజా కథనాలు