BREAKING: కల్వకుంట్ల కవితకు కాంగ్రెస్ పార్టీ మద్దతు

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న‌కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కవితకు మద్దతు ఇస్తున్నట్లు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. 

New Update
Gvp8JQRbsAEJw4K

BRS MLC kavitha

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న‌కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కవితకు మద్దతు ఇస్తున్నట్లు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. 

ఎమ్మెల్సీ కవితపై మల్లన్న వ్యాఖ్యలు గర్హనీయమని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మహిళలను గౌరవించుకోవడం మన సంప్రదాయం.. కవితపై ఎమ్మెల్సీ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండించాల్సిందే అని చెప్పారు. అలాగే మల్లన్న కార్యాలయంపై దాడి చట్ట వ్యతిరేకం, చట్ట పరిధిలో అందరూ పని చేసుకోవాలని ఆయన సూచించారు. మల్లన్న కార్యాలయంపై దాడి, గన్ మెన్ కాల్పులు జరిపిన అంశాలపై వచ్చిన ఫిర్యాదులపై చట్ట పరిధిలో విచారణ జరుగుతుందని ఆయన తెలిపారు. బిసి రిజర్వేషన్లు కాంగ్రెస్ కృషి ఫలితమే అని టీపీసీసీ స్పష్టం చేశారు. బిసి రిజర్వేషన్ల అంశంలో ఇతరులు లబ్ది పొందాలని చూడడం సమంజసం కాదని ఆయన చెప్పుకొచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు