Drugs: 'బచ్చా ఆగయా' వాట్సాప్‌ కోడ్‌తో గంజాయి విక్రయం.. 14 మంది అరెస్టు

హైదరాబాద్‌లో ఓ సంచలన విషయం బయటపడింది. ‘భాయ్‌ బచ్చా ఆగయా భాయ్‌’ అనే వాట్సప్‌ కోడ్‌తో గంజాయిని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. 14 మందిని అదుపులోకి తీసుకోని డీఅడిక్షన్ సెంటర్లకు తరలించారు.

New Update
Drugs in Hyderabad

Drugs in Hyderabad

మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న ఎక్కడో ఓ చోట వీటి రవాణా అక్రమంగా జరుగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్‌లో ఓ సంచలన విషయం బయటపడింది. ‘భాయ్‌ బచ్చా ఆగయా భాయ్‌’ అనే వాట్సప్‌ కోడ్‌తో గంజాయిని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. 14 మందిని అదుపులోకి తీసుకోని డీఅడిక్షన్ సెంటర్లకు తరలించారు. 

Also Read: 17 రోజుల్లో 30 పుణ్యక్షేత్రాలు.. అదిరిపోయే ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్

ఇక వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రకు చెందిన గంజాయి సరఫరాదారు సందీప్‌ను ఇటీవల ఈగల్‌ టీమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతడి ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్‌ లిస్ట్‌ను పరిశీలించారు. వీటి ఆధారంగా డెకాయి ఆపరేషన్‌ను నిర్వహించారు. ‘భాయ్‌ బచ్చా ఆగయా భాయ్‌’ అనే వాట్సప్‌ కోడ్‌తో గంజాయి వచ్చిందంటూ కస్టమర్లకు స్వయంగా పోలీసులే మెసేజ్‌లు చేశారు. దీంతో వారు షేర్ చేసిన లోకేషన్‌కు 14 మంది గంజాయి వినియోగదారులు వచ్చారు.   

Also Read: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..రంగంలోకి జాతీయ మహిళా కమిషన్

వీళ్లలో ఐటీ ఉద్యోగులు, ఆన్‌లైన్‌ ట్రేడర్లు,రిలేషన్‌షిప్‌ మేనేజర్లు, డెంటల్‌ టెక్నీషియన్లు, ఆఖరికి విద్యార్థులు కూడా ఉన్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఓ వ్యక్తి తన భార్య, నాలుగేళ్ల కొడుకుతో కూడా అక్కడికి వచ్చాడు. దీంతో పోలీసులు ఆ 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్లకి యూరిన్‌ టెస్టు నిర్వహించారు. అందులో పాజిటివ్ వచ్చింది. చివరికి ఆ 14 మందిని డీఅడిక్షన్ సెంటర్లకు తరలించారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు