🔴Live Breakings: మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్పై పవన్ సంచలన ప్రకటన
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
మెటాకు చెందిన ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. వాట్సాప్ సందేశాలు వెళ్లడం లేదని, స్టేటస్ లు అప్లోడ్ కావడం లేదని యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
దేశంలో మరోసారి యూపీఐ సేవలు నిలిచిపోయాయి. డిజిటల్ పేమెంట్స్ కావడం లేదని సోషల్ మీడియాలో కస్టమర్లు ట్వీట్స్ చేస్తున్నారు. పేమెంట్స్ కాకపోవడంతో కస్టమర్లతో పాటు వ్యాపారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. యూపీఐ పేమెంట్స్ ఆగిపోవడం ఇది రెండోసారి.
చైనా-అమెరికా మధ్య టారిఫ్ యుద్ధాల వల్ల బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.95, 410 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 95, 410 ఉంది.
యూఎస్ డాలర్ విలువ రోజు రోజుకూ తగ్గిపోతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారీఫ్ లకు 90 రోజులు గడువు ఇచ్చినా కూడా డాలర్ వాల్యూ మాత్రం పెరగడం లేదు. దీనికి కారణం ఇన్వెస్టర్లకు అమెరికా ఆర్థిక వ్యవస్థపై నమ్మకం తగ్గడమే కారణం అని చెబుతున్నారు.
వరుసగా 3రోజుల్లో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ పై రూ.5670 లు పెరిగింది. అటు కిలో వెండిపై దాదాపు రూ.5వేలు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న 24 క్యారెట్(10గ్రా) పసిడి రూ.95,400 కాగా, 22 క్యారెట్ (10గ్రా) బంగారం ధర రూ.87,450 ధర పలుకుతోంది.
నిన్నటి ఆసియా, అమెరికా మార్కెట్ల ఊపు ఇవాళ భారత స్టాక్ మార్కెట్లకు వచ్చింది. ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన 90 రోజుల పాస్..మార్కెట్లు ఎదుగుదలకు కారణమయింది. దీంతో ఈరోజు మన స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో రోజును ప్రారంభించాయి.
టెస్లా USలో కొత్త లాంగ్-రేంజ్ సైబర్‌ట్రక్ వేరియంట్‌ను $69,990 అంటే సుమారు రూ. 58 లక్షలకి విడుదల చేసింది. ఇది టెస్లా సైబర్ట్రక్లలో తక్కువ ధర కలిగిన మోడల్‌గా, మెరుగైన బ్యాటరీ సామర్థ్యం తో ఎక్కువ మైలేజ్ ఇస్తుంది.
అమెరికాలో బర్డ్ ఫ్లూ కారణంగా కోడి గుడ్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. 2023 ఆగస్టులో డజను గుడ్లు 2.04 డాలర్లు (రూ.175) కాగా, 2025 మార్చిలో అది 6.23 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీలో 12 కోడిగుడ్లు కొనాలంటే రూ.536 చెల్లించాలి. ఒక్కో గుడ్డుకు రూ.44 లు పడుతుంది.