Ananth Ambani Pet: అంబానీ ఫ్యామిలీలో విషాదం.. 'హ్యాపీ' ఇక లేదు..!

ముఖేష్ అంబానీ నివాసంలో విషాదం చోటుచేసుకుంది. అనంత్ అంబానీకి ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్క 'హ్యాపీ' మృతి చెందింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'హ్యాపీ' అంటూ నెటిజన్లు కుక్కకు సంబంధించిన ఫొటోలు వీడియోలు షేర్ చేస్తున్నారు.

New Update
ananth ambani's  dog 'happy' passed away

ananth ambani's dog 'happy' passed away

Ananth Ambani's  dog:  అనంత్ అంబానీకి ఎంతో ప్రియమైన, ఇష్టమైన పెట్ డాగ్  'హ్యాపీ' ఈరోజు కన్నుమూసింది. ఈ విషయాన్ని వైరల్ భయానీ అనే ఇన్ స్టాగ్రామ్ పేజ్ పంచుకుంది.  గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన హ్యాపీ, అనంత్,  రాధికా మర్చెంట్ వివాహానికి సంబంధించిన వేడుకల సమయంలో ఎంతోమంది మనసులు గెలుచుకుంది. ఎప్పుడూ అనంత్ పక్కనే తిరుగుతూ కనిపించేది. ఎంతో ప్రేమగా పెంచుకున్న గ్యాప్ మరణంతో అంబానీ నివాసంలో విషాద అలుముకుంది. 

ఇది కూడా చూడండి: YS JAGAN: సింహాచలం గుడి ప్రమాదంలో మృతులను పరామర్శించిన జగన్..

పెంపుడు జంతువు మాత్రమే కాదు 

అంబానీ కుటుంబం అంతా 'హ్యాపీ' ఫొటోకు పూలమాల వేసి.. నివాళులు అర్పించారు.  అంబానీ అప్డేట్ పేజ్ ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. "హ్యాపీ ఒక పెంపుడు జంతువు మాత్రమే కాదు, ఒక కుటుంబ సభ్యుడిగా ఉండేది. నిస్వార్థమైన  ప్రేమ,  ఓదార్పుకు ప్రతిరూపం. హ్యాపీ మాకు ఇచ్చిన ఆనందం మరువలేం. నిన్ను ఎప్పటికీ మర్చిపోలేం హ్యాపీ అంటూ రాసుకొచ్చారు. 

ఇది కూడా చదవండి: వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తింటున్నారా.. జాగ్రత్త

అనంత్ పెళ్ళిలో స్పెషల్ అట్రాక్షన్ 

హ్యాపీ  అనంత్ అంబానీ,  రాధికా మర్చెంట్ వివాహ వేడుకల్లో  అందరి దృష్టిని ఆకర్షించింది. అది ధరించిన గులాబీ బెనారసీ సిల్క్ బ్రోకేడ్ జాకెట్ ప్రత్యేకంగా అహ్మదాబాద్‌లోని "పంక్ డిజైనర్ పెట్ వేర్" సంస్థ తయారు చేసింది. ఇదిలా ఉంటే అనంత్ అంబానీకి వ్యక్తిగతంగా మూగ జీవులు, జంతువులు అంటే చాలా ఇష్టం. వాటిపై ప్రేమతో  జామ్‌నగర్‌లో వంతారా (Vantara) అనే పెద్ద జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇది గాయపడిన,  ప్రమాదంలో ఉన్న జంతువులను సంరక్షించడానికి పనిచేస్తుంది. 

ananth-ambani | ananth ambani pet happy 

ఇది కూడా చదవండి: మెంతుల ఫేస్‌ ప్యాక్‌తో ముఖం మెరవడం ఖాయం.. ఇలా చేసుకోండి

Advertisment
Advertisment
తాజా కథనాలు