Salary: చుట్టూ ఉన్నవారు ఇలా ప్రవర్తిస్తున్నారా.. అయితే మీ సంపాదన చెప్పవద్దు

సంపాదన ఎప్పుడూ కూడా ఇలాంటి ప్రవర్తన ఉన్న వ్యక్తులకు చెప్పకూడదట. అసూయ పడేవారికి, ఎక్కువగా అప్పు అడుగుతున్న వారికి, దూరం బంధువులకు, సహోద్యోగులకు చెప్పకూడదని నిపుణులు అంటున్నారు. వీరికి చెబితే ఏదో విధంగా ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు.

New Update
Salary

Salary

Salary: డబ్బులు అనేవి ప్రతీ ఒక్కరికి కూడా అవసరమే. ఈ డబ్బుల కోసం నెల అంతా కూడా కష్టపడతారు. అయితే చాలా మంది నీ సంపాదన ఎంతని అడుగుతుంటారు. కొందరికి శాలరీ చెప్పడం ఇష్టమైతే చెబుతారు. మరికొందరికి ఇష్టం లేకపోతే చెప్పడం మానేస్తారు. అయితే మీ సంపాదన గురించి కొందరికి మాత్రం అసలు చెప్పకూడదని నిపుణులు అంటున్నారు. వారు ఎవరో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి:CSK VS PBKS: పంజాబ్ కింగ్స్ చితక్కొట్టేసింది..చెన్నైకు హ్యాట్రిక్ ఓటమి

అసూయపడేవారు

పైకి మీతో మంచిగా మాట్లాడినా కూడా అసూయ పడే వారికి మాత్రం మీ సంపాదన గురించి అసలు చెప్పకూడదు. దీనివల్ల వారు మిమ్మల్ని ఏదో విధంగా సమస్యల్లో నెట్టడానికి ప్రయత్నిస్తారు. 

ఇది కూడా చూడండి:CSK VS PBKS: ధనా ధన్.. సామ్ కరన్ కుమ్మేశాడు - పంజాబ్ కింగ్స్‌కు కిక్కు దిగే టార్గెట్!

సహోద్యోగులు

తోటి ఉద్యోగులకు మాత్రం మీ శాలరీని ఎప్పుడు చెప్పవద్దు. మీ శాలరీ వారి కంటే ఎక్కువ అయితే మాత్రం వారు మిమ్మల్ని వర్క్ విషయంలో కాస్త ఇబ్బందులు పెడతారు. కాబట్టి ఆఫీస్‌లో ఉండే మీ స్నేహితులతో శాలరీ డిస్కస్ చేయవద్దు.

ఇది కూడా చూడండి:YS JAGAN: సింహాచలం గుడి ప్రమాదంలో మృతులను పరామర్శించిన జగన్..

అప్పు అడిగే స్నేహితులకు

కొందరు స్నేహితులు ఎక్కువగా అప్పు అడుగుతుంటారు. ఇలాంటి వారికి మీ శాలరీ గురించి చెప్పకపోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.

దూరపు బంధువులు

రిలేటివ్‌లో ఉండే కొందరు ఎలా ఉన్నావని కాల్ చేయరు. కానీ జీతం ఎంత? అని అడగటానికి కాల్ చేస్తుంటారు. ఇలాంటి వారికి మీ సంపాదన చెప్పకపోవడమే మంచిది. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

Advertisment
తాజా కథనాలు