Jio Free Gold Offer: జియో ఫ్రీ గోల్డ్ ఆఫర్.. ‘అక్షయ తృతీయ’ వేళ కొత్త సేల్ - ఎలా పొందాలంటే?

అక్షయ తృతీయ వేళ ‘జియో గోల్డ్ 24K డేస్’ సేల్‌ను జియో ప్రకటించింది. రూ.1000-రూ.9,999 వరకు ఇన్వెస్ట్ చేస్తే ప్రోమోకోడ్ ద్వారా 1%, రూ.10వేల కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే 2%ఎక్స్‌ట్రా గోల్డ్ వస్తుంది. జియోఫైనాన్స్ యాప్ లేదా మైజియో యాప్ కొనుక్కోవాల్సి ఉంటుంది.

New Update
jio free gold offer

Jio Free Gold Offer

Jio Free Gold Offer: రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. అక్షయ తృతియ పండుగ వేళ బంగారం ఫ్రీగా అందిస్తుంది. జియో ఫైనాన్స్ యాప్ (Jio Financial Services Limited (JFSL)) ద్వారా డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసేవారికి 2 శాతం వరకు ఎక్స్‌ట్రా బంగారాన్ని ఫ్రీగా అందిస్తోంది. దీని కోసం ‘‘జియో గోల్డ్ 24K డేస్’’ (Jio Gold 24K Days) పేరుతో ఓ స్పెషల్ ఆఫర్‌ను తీసుకు వచ్చింది. 

Also Read: హర్యానాలో ఐస్ క్రీంలు అమ్ముకుంటున్న పాక్ ఎంపీ.. ఆయన కన్నీటి కథ ఇదే!

jio free gold offer

ఈ ఆఫర్ ఏప్రిల్ 29 నుంచి మే 5వ తేదీ వరకు ఉంటుంది. ఈ ఆఫర్ సమయంలో జియోఫైనాన్స్ యాప్(Jio Finance App) లేదా మై జియో యాప్ ద్వారా డిజిటల్ గోల్డ్ కొనుక్కునే యూజర్లు ఎక్స్‌ట్రాగా ఫ్రీ గోల్డ్ గెలుచుకోవచ్చు. ఇక ఆఫర్ వివరాల విషయానికొస్తే..  

Also Read: పాక్ జర్నలిస్టులకు షాక్ ఇచ్చిన భారత్.. కేంద్రం సంచలన నిర్ణయం

ఆసక్తి గల గోల్డ్ ప్రియులు రూ.1,000 నుంచి రూ. 9,999 వరకు పెట్టుబడి పెట్టాలి. అప్పుడు చెక్అవుట్ సమయంలో JIOGOLD1 అనే ప్రోమో కోడ్ వస్తుంది. అది ఉపయోగిస్తే 1% ఫ్రీ గోల్డ్ వస్తుంది.

అలాగే రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెడితే JIOGOLDAT100 ప్రోమో కోడ్‌ వస్తుంది. దీన్ని అప్లై చేస్తే ఏకంగా 2% ఎక్స్‌ట్రా గోల్డ్ లభిస్తుంది. దీంతో 72 గంటల్లోగా ఈ ఫ్రీ గోల్డ్ మీ డిజిటల్ గోల్డ్ అకౌంట్‌లోకి వచ్చేస్తుంది. అనంతరం మొబైల్ నెంబర్‌కు కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది. 

Also Read:  Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

కాగా ఒకేసారి ఎక్కువ మొత్తంలో (లంప్-సమ్) డిజిటల్ గోల్డ్ కొనేవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆఫర్ సమయంలో యూజర్ గరిష్టంగా 10 సార్లు మాత్రమే దీనిని యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫ్రీ గోల్డ్ వ్యాల్యూ రూ.21వేలకు మించకూడదు. జియో ఫైనాన్స్ యాప్ లేదా మై జియో యాప్ ద్వారా బంగారం కొంటేనే ఈ ఆఫర్‌కు అర్హత సాధిస్తారు.

telugu-news | latest-telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు