Vivo Y19 5G: బడ్జెట్ ఫ్రెండ్లీ వివో Y19 5G వచ్చేసింది.. చైనా ఫోన్లు జుజుబీ..!

వివో Y19 5G బడ్జెట్ ఫోన్‌ భారత్‌లో విడుదలైంది. ఇది 6.74" 90Hz డిస్‌ప్లే, 5500mAh బ్యాటరీ, Dimensity 6300 ప్రాసెసర్, 13MP AI కెమెరాతో లభిస్తోంది. ధర ₹10,499 వద్ద ప్రారంభమవుతుంది. IP64 సర్టిఫికేషన్ తో Flipkart మొదలైనవాటిలో అందుబాటులో ఉంది.

New Update
Vivo Y19 5G

Vivo Y19 5G

Vivo Y19 5G: వివో మే 1, 2025న భారత మార్కెట్‌లో కొత్త Vivo Y19 5G ను ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 5G కనెక్టివిటీతో పాటు దుమ్ము ఇంకా నీటి నిరోధకతకు IP64 సర్టిఫికేషన్ తో కలిగి ఉంది, AI ఆధారిత కెమెరా ఫీచర్లు వంటి ఆధునిక లక్షణాలతో బడ్జెట్ లో వినియోగదారులకు అందుబాటులో ఉంది.

డిస్‌ప్లే & డిజైన్..

వివో Y19 5G లో 6.74-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉంది, ఇది 90Hz రిఫ్రెష్ రేట్ అందిస్తోంది. దీని 700 నిట్స్ పీక్స్ బ్రైట్‌నెస్ ద్వారా వెలుతురు ఉన్న ప్రదేశాల్లో కూడా స్పష్టమైన లైటింగ్ ను అందిస్తుంది. ఈ ఫోన్ టైటానియం సిల్వర్, మజెస్టిక్ గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంది.

Also Read: ఇజ్రాయెల్‌లో భారీ కార్చిచ్చు.. వ్యాపిస్తున్న మంటలు.. ఆందోళనలో వేలాది మంది ప్రజలు

బ్యాటరీ..

ఈ ఫోన్‌లో శక్తివంతమైన MediaTek Dimensity 6300 చిప్‌సెట్ ని ఉపయోగించారు, అతి తక్కువ ధరలో బెస్ట్ 5G పని తీరును అందిస్తుంది.

మూడు వేరియంట్లలో.. 

4GB RAM + 64GB స్టోరేజ్ – ₹10,499

4GB RAM + 128GB స్టోరేజ్ – ₹11,499

6GB RAM + 128GB స్టోరేజ్ – ₹12,999

ఇతర ఫోన్‌లతో పోలిస్తే ఎక్కువ 5,500 mAh బ్యాటరీ తో వస్తుంది, దానికి తోడు బాక్స్‌లో 15W ఛార్జర్ ఉచితంగా వస్తుంది. దీని వలన ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది.

Also Read: ‘కాళీ’తో పాక్ పని ఖతం.. భారత్ దగ్గరున్న ఈ రహస్య ఆయుధం గురించి మీకు తెలుసా..?

కెమెరా ఫీచర్లు..

ఫొటోగ్రఫీ కోసం, ఈ ఫోన్‌లో 13MP కెమెరా ఉంది, ఇది AI నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, ప్రో మోడ్, AI ఇరేజ్, AI ఫోటో ఎన్హాన్స్, AI డాక్యుమెంట్స్ లాంటి ఫీచర్లతో వస్తుంది. సెల్ఫీల కోసం ముందు 5MP కెమెరా ఉంది.

ధర..

Vivo Y19 5G ఇప్పుడు Flipkart, Vivo అధికారిక ఈ-స్టోర్, ఆఫ్లైన్ రిటైల్ షాపుల ద్వారా కొనుగోలు చేయవచ్చు. బెస్ట్ టెక్నాలజీ తో నిండి ఉన్నా సరసమైన ధరతో అందుబాటులో ఉండడం వలన, ఇది కొత్తగా 5G ఫోన్ కొనాలనుకునే వారికి, బడ్జెట్ వినియోగదారులకు మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.

Also Read: YS JAGAN: సింహాచలం గుడి ప్రమాదంలో మృతులను పరామర్శించిన జగన్..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు