/rtv/media/media_files/2024/12/31/oviDILSXlaWfxd1LT04L.jpg)
Cheapest Recharge Plan
Cheapest Recharge Plan: ఈ మధ్య కాలంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అదే సమయంలో సోషల్ మీడియా వాడే వారి సంఖ్య కూడా పెరిగింది. దీంతో రీఛార్జ్ ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత ప్రముఖ టెలికం కంపెనీలు తమ రీఛార్జ్ ధరలను బాగా పెంచేశాయి. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలు భారీ స్థాయిలో తమ టారీఫ్ ధరలను పెంచేశాయి.
Also Read: పాక్‌కు భారత్ మరో ఊహించని షాక్.. అప్పు ఇవ్వొద్దని IMFకు కంప్లైంట్!
ఈ క్రమంలో ప్రముఖ ప్రభుత్వ టెలికం సంస్థ BSNL రంగంలోకి దిగి తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఇతర నెట్‌వర్క్ ప్రియులంతా బీఎస్ఎన్ఎల్ వైపే ఆసక్తి చూపారు. అదే సమయంలో ఆ కంపెనీ కూడా అద్భుతమైన ఆఫర్లు అందిస్తూ మరింత మందిని తనవైపుకు తిప్పుకుంటుంది.
ఇందులో భాగంగానే తాజాగా మరొక అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. కేవలం 30 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాలింగ్, బంపర్ డేటా ప్రయోజనాలతో వచ్చే ఈ చౌకైన రీఛార్జ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం.
Also Read: మనకు అణ్వాయుధాలున్నాయి..మనల్నేం చేయలేరు....మరియం నవాజ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
BSNL రూ. 199 రీఛార్జ్ ప్లాన్
BSNL తాజాగా 199 రూపాయల రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ప్రతిరోజూ 2GB డేటా ప్రయోజనాన్ని పొందుతారు. మొత్తం 60GB డేటా ప్రయోజనం లభిస్తుంది. ఇంకా ఈ ప్లాన్ రోజువారీ 100 SMSలు అందిస్తుంది. అంతేకాకుండా అపరిమిత కాలింగ్ ప్రయోజనం కూడా ఉంది. అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాల్స్ అందుబాటులో ఉన్నాయి. రోజువారీ డేటా అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ వేగం గరిష్టంగా 40Mbps తో నడుస్తుంది.
Also Read : ఆ సమస్యలను పరిష్కరించండి...కేంద్ర మంత్రితో ఎంపీ సానా సతీష్ బాబు భేటీ!
BSNL రూ.197 రీఛార్జ్ ప్లాన్
BSNL నుంచి మరొక అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ ఉంది. అదే రూ. 197 ప్లాన్. ఇది 70 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ప్రతిరోజూ 2GB డేటా సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ ముంబై వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ డేటా ప్లాన్ ప్రయోజనాన్ని 70 రోజుల పాటు పొందవచ్చు.
Also Read : Haryana: ఆ నీరు పాకిస్థాన్‌కు వెళ్లొద్దు.. హర్యానా కీలక ప్రకటన
BSNL New Recharge Plan | recharge-offer | Mobil recharge officers | latest-telugu-news | telugu-news