/rtv/media/media_files/2025/09/10/pawan-kalyan-2025-09-10-17-16-21.jpg)
BREAKING: ప్రజలు కోరుకున్న పాలనే కూటమి ప్రభుత్వం అందిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌అన్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో అనంతపూర్‌లో నిర్వహిస్తున్న విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చుతున్నామన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కృషి చేస్తున్నమన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా అమలు చేస్తున్నామన్నారు.యువత, మహిళలు, రైతులు భవిష్యత్ కోసమే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పవన్ అన్నారు.
Also Read : తాను తీసిన గోతిలో తానే..అమెరికా కంపెనీలపై ట్రంప్ సుంకాల దెబ్బ
ఒకేరోజు రికార్డు స్థాయిలో గ్రామసభలు నిర్వహించామని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలి. ఆనందంగా ఉండాలి. మీరు ఎలా ఆలోచించారో మేమంతా పార్టీలు వేరయినప్పటికీ రాష్ర్ట హితము, రాష్ర్ట శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈరోజు మీ ముందుకు వచ్చి ఇంత ఘనవిజయంగా, ఇంత దిగ్విజయంగా ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకువచ్చామ. దీనికి సంబంధించి భవిష్యుత్తు రాయలసీమ వెనుకబాటు తనం గురించి దానికి నీటి సౌకర్యం గురించి, పారిశ్రామికీ కరణ గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతారన్నారు.త్వరలోనే ఆరోగ్య బీమా పథకం సాకారం కాబోతుంది. ఒక్కో పథకం ద్వారా ఒక్క కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్యబీమా వర్తిస్తుంది. పర్యటక రంగానికి సంబంధించి కూడా 10 వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్శిస్తున్నాము. పంచాయితీ రాజ్ శాఖలో 13.300 గ్రామపంచాయతీలలో గ్రామస భలు నిర్వహించి రికార్డు క్రియెట్ చేశామన్నారు.
Also Read : మళ్ళీ భారీగా పెరిగిన బంగారం.. ఒక్క రోజులోనే రూ. 5 వేలకు పైగా..
2007 కిలో మీటర్ల బీటీ రోడ్లను, 4000 సీసీ రోడ్లను నిర్మించాం. లక్షా50వేల నీటి కుంటలు నిర్మించి 1 టీఎంసీ ని నిల్వచేయగలిగామన్నారు. మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు 1500 పైగా నీటి తొట్లు నిర్మించామన్నారు. 22518 మినీ గోకులాలు ఏర్పాటు చేశామన్నారు. అడవితల్లి బాట కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోడీ సహకారంతో 1005 కోట్ల తో పీఎం జన్మన్ పథకం, మహ్మాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1069 కిలోమీటర్ల రోడ్లు నిర్మించి గర్బీణీ స్ర్తీలకు డోలి మోతల నుంచి విముక్తి కలిపించబోతున్నామన్నారు. 7910 కోట్లతో జల్ జీవన మిషన్ ప్రాజెక్టులు చేపట్టామన్నారు.
Also Read:'రాజా సాబ్' ప్రొడ్యూసర్ క్రేజీ అప్‌డేట్.. రెబల్ ఫ్యాన్స్ కి పండగే..!