/rtv/media/media_files/2025/09/10/relief-centers-set-up-in-delhi-for-telugu-residents-who-stranded-in-nepal-2025-09-10-13-33-28.jpg)
relief centers set up in Delhi for Telugu residents who stranded in nepal
నేపాల్(Nepal) లో జెన్ Z యువత చేపట్టిన ఆందోళలు హింసాత్మక ఘటనలకు దారితీసిన సంగతి తెలిసిందే. అక్కడ తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు తెలుగు ప్రజలు చిక్కుకున్నారు. దీంతో వాళ్లకు సాయం అందించేందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలకు దిగాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ ప్రభుత్వం సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ముగ్గురు అధికారులతో కూడిన టీమ్‌కు బాధ్యతలు అప్పగించింది. అలాగే నేపాల్ రాజధాని ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం కూడా భారతీయుకు సాయం చేస్తోంది. +977 – 980 860 2881 +977 – 981 032 6134 నెంబర్లకు సాధారణ కాల్స్‌తో పాటు, వాట్సాప్‌లో కూడా సంప్రదించవచ్చని సూచించింది.
Also Read: ప్రైవేట్ స్కూల్లో చదివించలేదని.. ముగ్గురు పిల్లలను గొంతుకోసి చంపిన తల్లి..!
Relief Centers Set Up In Delhi For Telugu Residents
అలాగే ఏపీ ప్రభుత్వం కూడా ఢిల్లీలోని ఏపీ భవన్(AP Bhavan) లో హైల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. +91 9818395787,+918500027678, ఇమెయిల్: [email protected], [email protected]ను సంప్రదించాలని సూచించింది. మరోవైపు నేపాల్‌లో చిక్కున్న ఏపీ ప్రజలను రాష్ట్రానికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు మంత్రి నారా లోకేష్ చర్యలకు దిగారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్‌లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నేపాల్‌లో చిక్కుకున్న ప్రజల సమాచారం గురించి అధికారులు లోకేశ్‌కు వివరించారు. పలువురు బాధితులతో కూడా ఆయన వీడియో కాల్ ద్వారా మాట్లాడారు.
Also Read: అయ్యో.. మాంసం లేక ఆగిపోయిన వందలాది పెళ్లిళ్లు.. ఎక్కడో తెలుసా ?
అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం నేపాల్‌లో 240 మంది తెలుగు వాళ్లు చిక్కుకున్నట్లు అధికారులు లోకేశ్‌కు చెప్పారు. ఖాట్మండు నుంచి విశాఖపట్నానికి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి అక్కడ చిక్కున్న వాళ్లని రప్పించాలని లోకేశ్ అధికారులకు ఆదేశించారు. బాధితులకు తక్షణ సాయం, తరలింపు బాధ్యతలు కూడా ఆయన అధికారులకు అప్పగించారు. అలాగే ప్రతి రెండు గంటలకొకసారి బాధితులు సమాచారం గురించి తెలుసుకోవాలని సూచించారు.
Also Read: ఛీఛీ వెధవలు.. 16 ఏళ్ల బాలుడ్ని రేప్ చేసిన మరో మైనర్, యువకుడు.. వీడియో తీసి..!