/rtv/media/media_files/2025/03/02/9Fne2PLZ5z0RsaXyYMcv.jpg)
accident Photograph: (accident)
CRIME: పెళ్లి భాజాలు మోగాల్సిన ఇంట్లో... విషాద ఛాయలు అలుముకున్నాయి. కొడుకు పెళ్లి ముహూర్తం పెట్టించుకుని తిరిగి వస్తుండగా తల్లిదండ్రులిద్దరూ రోడ్డు ప్రమాదం(Road Accident) లో మృతి చెందారు. ఈ విషాదకర ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ జిల్లా గనిఆత్కూరుకు దామినేని శ్రీనివాసరావు(54), రజనీకుమారి(45) దంపతులు కొద్దిరోజుల్లో కొడుకు చంద్రశేఖర్ పెళ్లి పెట్టుకున్నారు. దీంతో ఈరోజు కొడుకు పెళ్లి ముహూర్తం పెట్టించడానికి ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడులోని పూజారి దగ్గరికి వెళ్లారు. ముహూర్తం ఖరారు చేసుకొని బైక్ పై తిరుగు ప్రయాణం అయ్యారు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. మార్గం మధ్యలో దంపతులిద్దరూ వస్తున్న బైక్ ని వెనుక నుంచి వచ్చిన వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలిద్దరు స్పాట్ లోనే చనిపోయారు. దీంతో పెళ్లి భాజాలతో సందడిగా ఉండాల్సిన ఇల్లు విషాద ఛాయలతో అలుముకుంది.
Also Read: Mother Killed Daughters: ప్రైవేట్ స్కూల్లో చదివించలేదని.. ముగ్గురు పిల్లలను గొంతుకోసి చంపిన తల్లి..!
Also Read : అమరావతిలో క్షుద్ర పూజలు.. అఘోరీ ఏం చేశాడంటే?