/rtv/media/media_files/2025/09/10/cbn-2025-09-10-16-31-17.jpg)
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభకు(Super Six Super Hit Public Meeting ) సీఎం చంద్రబాబు హాజరైయ్యారు. ఈ సభ రాజకీయా కోసం, ఓట్ల కోసం కాదని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జవాబుదారీతనం, బాధ్యత కలిగిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి చరిత్ర తిరగరాసిందని ముఖ్యమంత్రి అన్నారు. అనంతపురంలో సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభ అదిరిందని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.
Also Read: ఫస్ట్ టైమ్.. కొడుకు ఫొటో షేర్ చేసిన వరుణ్ తేజ్.. ఎంత క్యూట్ గా ఉన్నాడో! పిక్స్ చూశారా
ఈ సందర్భంగా వైసీపీ పార్టీపై విమర్శలు గుప్పించారు. గతప్రభుత్వం కూల్చి వేతలతో పాలన ప్రారంభించింది. ఐదేళ్ల పాలనలో విధ్వంసం జరిగిందని చెప్పుకొచ్చారు. దసరా రోజున వాహన మిత్ర పథకం ప్రారంభించి.. ఒక్కో ఆటో డ్రైవర్‌కు రూ.15వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకే ఈ సభ ఏర్పాటు చేశామని బాబు అన్నారు.
సోషల్ మీడియాలో ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. హింసా రాజకీయాలు చేస్తే ఊరుకోమని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలే అనే విషయం వైసీపీ మర్చిపోయిందని ఆయన అన్నారు. శాసనసభకు రాకుండా రప్పా రప్పా అంటూ వైసీపీ నేతలు రంకెలేస్తున్నారని ఎద్దేవా చేశారు.
సూపర్ సిక్స్ అంటే అప్పుడు వైసీపీ అవహేళన చేసిందని.. ఇప్పుడు అది సూపర్ హిట్ అయ్యిందని చెప్పారు. ఫ్రీ బస్సు కదలదన్నారు.. దీపం వెలగదని వైసీపీ నాయకులు ఎద్దేవా చేశారు. కానీ అందరి సహకారంతో సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశమని అన్నారు. ఇప్పటి వరకు 5 కోట్ల మంది ఫ్రీ బస్సు పథకం వినియోగించుకున్నారు.
Also Read: ముసలోడు కాదు...మూర్కుడు..11 ఏళ్ల చిన్నారిపై 80 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం
ఉచిత బస్సు పథకం జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది. ఎంతమంది పిల్లలుంటే అంత మందికి రూ.15వేలు ఇచ్చాం. తల్లికి వందనం అమలు చేసి తల్లుల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. సూపర్ సిక్స్ పథకాల ద్వారా కోట్ల మంది లబ్ధి పొందారు. రైతన్నకు అండగా ఉండేందుకు అన్నదాత సుఖీభవ తెచ్చాం. 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశాం. దీపం-2 పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ప్రతి ఇంట్లో వెలుగులు నింపాం కాబట్టే దీపం పథకం సూపర్ హిట్ అయింది. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశాం’’ అని చంద్రబాబు తెలిపారు.
Also Read:అయ్యో.. మాంసం లేక ఆగిపోయిన వందలాది పెళ్లిళ్లు.. ఎక్కడో తెలుసా ?
రాష్ట్రంలో అధికారం చేపట్టాక 3 పార్టీలు కలిసి నిర్వహిస్తున్న తొలిసభ కావడంతో కార్యకర్తలు భారీగా తరలించ్చారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సభకు హాజరయ్యారు.